twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీడియం రేంజ్ హీరోల్లో బాహుబలి లాంటి రెమ్యునరేషన్.. వరుణ్ తేజ్ డిమాండ్ మామూలుగా లేదు!

    |

    స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఈ రోజుల్లో ఉహాలకందని రేంజ్ లో ఉంటోంది. అయితే ఆ నెంబర్లు ఒక విధంగా మార్కెట్ కు తగ్గట్లుగానే ఉంటున్నాయి. నిర్మాతలు కూడా అన్ని వైపులా చూసుకొని హీరోలకు పారితోషికాలు అడిగినంత ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలలో వరుణ్ తేజ్ అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.

    రెమ్యునరేషన్ పెరగడానికి అదొక కారణం

    రెమ్యునరేషన్ పెరగడానికి అదొక కారణం

    గత కొంతకాలంగా టాలీవుడ్ మార్కెట్ కొంచెంకొంచెంగా పెరుగుతొంది. కేవలం థియేట్రికల్ గానే కాకుండా విభిన్న రూపంలో సినిమాలకు మార్కెట్ ఏర్పడుతోంది. స్టార్ హోదాను బట్టి కొన్ని సినిమాలకు మంచి డిజిటల్ రైట్స్ అందుతున్నాయి. ఓటీటీ శాటిలైట్ ద్వారానే నిర్మాతలు ఈజీగా సేఫ్ జోన్ లోకి వచ్చేస్తున్నరు. రెమ్యునరేషన్ పెరగడానికి నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఒక ముఖ్య కారణం.

     ఒక్క హిట్టు పడగానే..

    ఒక్క హిట్టు పడగానే..

    ఇక సక్సెస్ రేటు ఎప్పటికప్పుడు రెమ్యునరేషన్ డోస్ పెంచేలా చేస్తోంది. ఏడాది నుంచి సినిమా షూటింగ్స్ లేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో మార్కెట్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని నిర్మాతలు కూడా నమ్ముతున్నారు. ఇక మొన్నటివరకు 5కోట్లు అన్నవారు కూడా ఒక్క హిట్టుతో 10కోట్ల మార్క్ ను టచ్ చేస్తున్నారు.

    బాక్సాఫీస్ హిట్టుతో..

    బాక్సాఫీస్ హిట్టుతో..

    వరుణ్ తేజ్ కూడా మెల్లగా రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది. ఈ హీరో ఫిదా అనంతరం మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. మధ్యలో అంతరిక్షం తప్పితే మిగతా సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రాఫిట్స్ ను అంధించాయి. ముఖ్యంగా F2 సినిమాతో వెంకటేష్ తో కలిసి వరుణ్ బెస్ట్ బాక్సాఫీస్ హిట్ ను షేర్ చేసుకున్నాడు.

     వరుణ్ తేజ్ రేటు 13కోట్లు

    వరుణ్ తేజ్ రేటు 13కోట్లు

    ప్రస్తుతం బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమాకు కూడా వరుణ్ తేజ్ 9కోట్ల లోపే రెమ్యునరేషన్ తీసుకున్నాడట. F3 సినిమాకు 8కోట్లు ఇచ్చినట్లు టాక్. ఇక రాబోయే సినిమాలకు మినిమమ్ 13కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. నిర్మాత భోగవల్లి ప్రసాద్ తో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చిన వరుణ్ 12కోట్లు తీసుకునేందుకు అగ్రిమెంట్ సెట్ చేసుకున్నట్లు సమాచారం.

    Recommended Video

    Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu
    నాగచైతన్య ఒక్కడే..

    నాగచైతన్య ఒక్కడే..

    ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలలో ఎవరు కూడా ఈ రేంజ్ లో తీసుకోవడం లేదు. ఇప్పటికే నాని రెమ్యునరేషన్ 10కోట్లను టచ్ చేస్తోంది. ఇక శర్వానంద్, నితిన్ వంటి హీరోలు కూడా ఒక్క హిట్టు పడితే ఆ మార్క్ ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే అందరిలో కూడా నాగచైతన్య ఆ స్థాయిలో డిమాండ్ చేయడం లేదని తెలుస్తోంది. ఇక సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ తో హిట్టు కొడితే అతని నెంబర్ కూడా కొంచెం పెరగవచ్చని సమాచారం.

    English summary
    Remuneration of Star Heroes is in the unmatchable range these days. But those numbers remain in line with the market in a way. The producers are also mindful on all sides and giving as much as they ask for rewards for the heroes. It is learned that Varun Tej is currently receiving the highest remuneration among medium range heroes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X