Gandeevadhari Arjuna 2 Days Collections: రెండో రోజే ఢమాల్.. మరీ ఇంత తక్కువా.. వరుణ్‌కు ఊహించని షాక్
పేరుకు మెగా హీరోనే అయినా తనలోని అన్ని టాలెంట్లను బయటకు తెచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. సరైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పాటు కొన్ని హిట్లను సైతం అందుకున్నాడు.
కానీ, 'గని'తో మళ్లీ వెనుకబడ్డాడు. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' మూవీతో వచ్చాడు. దీనికి మాత్రం రెస్పాన్స్ సరిగా రావడం లేదు. ఫలితంగా వసూళ్లు డల్‌గా ఉన్నాయి. మరి వరుణ్ మూవీకి 2 రోజుల్లో ఎంత వచ్చిందో చూద్దామా!

గాండీవధారి అర్జునగా వరుణ్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'గాండీవధారి అర్జున'. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా.. నాజర్, విమలా రామన్, వినయ్ రాజ్, అభినవ్ గోమటం కీలక పాత్రలు చేశారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు.

వరుణ్ తేజ్ మూవీ బిజినెస్: వరుణ్ తేజ్ - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'గాండీవధారి అర్జున' చిత్రానికి దాదాపు రూ. 42 కోట్లు వరకూ బడ్జెట్ అయినట్లు తెలిసింది. ఇక, ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉన్నా బిజినెస్ మాత్రం ఆశించిన రీతిలో జరగలేదని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా వరుణ్ తేజ్ సినిమా రూ. 18 కోట్లు వరకూ బిజినెస్ చేసిందని తెలిసింది.

రెండో రోజు తెలుగులో ఇలా: ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన 'గాండీవధారి అర్జున' సినిమాకు ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. ఇదే కంటిన్యూ అవుతూ రెండో రోజు కూడా ఈ చిత్రం తేలిపోయింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 45 లక్షలు గ్రాస్‌తో పాటు రూ. 23 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. దీంతో వరుణ్ తేజ్‌కు ఊహించని షాక్ తగిలినట్లైంది.

2 రోజులకూ కలిపి ఎంతంటే: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'గాండీవధారి అర్జున' మూవీకి రెండు రోజుల్లోనూ ఆంధ్రా, తెలంగాణలో తక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 80 లక్షలు, సీడెడ్‌లో రూ. 22 లక్షలు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కలిపి రూ. 83 లక్షలు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి వరుణ్ తేజ్ మూవీ రూ. 1.85 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 98 లక్షలు షేర్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు: 2 రోజుల్లో ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 1.85 కోట్లు గ్రాస్ మాత్రమే రాబట్టిన 'గాండీవధారి అర్జున' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలుపుకుని కేవలం రూ. 65 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.50 కోట్లు గ్రాస్, రూ. 1.28 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ కాంబోలో వచ్చిన 'గాండీవధారి అర్జున' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18.00 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 1.28 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో రూ. 16.72 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

ఈ మధ్య కాలంలో దారుణం: ఈ మధ్య కాలంలో మీడియం రేంజ్ హీరోల చిత్రాలకు కనీసం రూ. 2 కోట్లకు పైగా షేర్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. కానీ, 'గాండీవధారి అర్జున' సినిమా మాత్రం దారుణమైన వసూళ్లతో నిరాశ పరిచింది. రెండో రోజు కూడా ఇది వరల్డ్ వైడ్‌గా రూ. 28 లక్షలు షేర్ మాత్రమే రాబట్టింది. ఇలా రెండు రోజుల్లో రెండు కోట్ల కూడా వసూలు చేయలేదు. ఇలా ఈ మధ్యన ఏ మూవీకి జరగలేదు.


Click it and Unblock the Notifications











