Gandeevadhari Arjuna 3 Days Collections: 45 కోట్ల సినిమా.. 3 రోజుల్లో ఘోరం.. అన్ని కోట్లు నష్టాలేనా!
మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చి.. ఆరంభంలోనే తనదైన చిత్రాలతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ చాలా విజయాలను ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో.. గత చిత్రంతో మాత్రం భారీ షాక్‌నే ఎదుర్కొన్నాడు. దీంతో ఇప్పుడు ఎలాగైనా కొట్టాలన్న పట్టుదలతో 'గాండీవధారి అర్జున' అనే సినిమాను చేశాడు. కానీ, దీనికి మాత్రం దారుణమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఈ చిత్రం వసూళ్లు చాలా తక్కువగా వస్తున్నాయి. మరి ఈ మూవీ రిపోర్టును మీరే చూడండి!
యాక్షన్ మూవీతో వచ్చేశాడు:మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన యాక్షన్ మూవీనే 'గాండీవధారి అర్జున'. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా.. నాజర్, విమలా రామన్, వినయ్ రాజ్, అభినవ్ గోమటం కీలక పాత్రలు చేశారు. దీనికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్‌ను అందించాడు.

వరుణ్ తేజ్ మూవీ బిజినెస్:వరుణ్ తేజ్ - సాక్షి వైద్యా కాంబినేషన్‌లో రూపొందిన 'గాండీవధారి అర్జున' చిత్రానికి దాదాపు రూ. 45 కోట్లు వరకూ బడ్జెట్ అయినట్లు తెలిసింది. ఇక, ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉన్నా బిజినెస్ మాత్రం ఆశించిన రీతిలో జరగలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా వరుణ్ తేజ్ సినిమా రూ. 18 కోట్లు వరకూ బిజినెస్ చేసిందని తెలిసింది.
మూడో రోజు తెలుగులో ఇలా:వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన 'గాండీవధారి అర్జున' సినిమాకు ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. ఇదే కంటిన్యూ అవుతూ మూడో రోజు కూడా ఈ చిత్రం తేలిపోయింది. సండే హాలీడే ఉన్నప్పటికీ ఈ చిత్రం 50 శాతం డ్రాప్‌ను చవి చూసింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు కేవలం రూ. 33 లక్షలు గ్రాస్, రూ. 12 లక్షలు షేర్ రాబట్టింది.

3 రోజులకూ కలిపి ఎంతంటే:యాక్షన్ జోనర్‌లో రూపొందిన 'గాండీవధారి అర్జున' మూవీకి మూడు రోజుల్లోనూ ఆంధ్రా, తెలంగాణలో తక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 96 లక్షలు, సీడెడ్‌లో రూ. 27 లక్షలు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కలిపి రూ. 95 లక్షలు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి వరుణ్ తేజ్ మూవీ రూ. 2.18 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 1.10 కోట్లు షేర్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు:ఏపీ, తెలంగాణలో కలిపి 3 రోజుల్లో రూ. 2.18 కోట్లు గ్రాస్ మాత్రమే రాబట్టిన 'గాండీవధారి అర్జున' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలుపుకుని కేవలం రూ. 84 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.02 కోట్లు గ్రాస్, రూ. 1.46 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:వరుణ్ తేజ్ నటించిన 'గాండీవధారి అర్జున' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18.00 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 1.46 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో రూ. 16.54 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

అన్ని కోట్లు నష్టాల దిశగానే:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన 'గాండీవధారి అర్జున' మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన రెస్పాన్స్‌తో నిరాశ పరుచుతోంది. మంచి వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నా ఈ మూవీ మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రెండు కోట్ల రూపాయల షేర్ కూడా రాబట్టలేదు. దీంతో ఈ సినిమా ఏకంగా రూ. 16 కోట్లకు పైగానే నష్టాలను చవి చూసే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











