Gandeevadhari Arjuna Day 1 Collections: వరుణ్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. ఆ డిజాస్టర్‌ కంటే దారుణం!

నాగబాబు కుమారుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టినా.. తనదైన టాలెంట్లను చూపిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ వస్తున్న అతడు.. ఎన్నో హిట్లను సైతం ఖాతాలో వేసుకున్నాడు. అయితే, తన గత చిత్రం 'గని'తో మాత్రం నిరాశనే ఎదుర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' అనే మూవీతో వచ్చాడు. దీనికి టాక్‌తో పాటు స్పందన కూడా ఆశించిన రీతిలో రాలేదు. మరి ఆలస్యం లేకుండా ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టును చూడండి!

గాండీవధారి అర్జునగా మెగా ప్రిన్స్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన యాక్షన్ మూవీనే 'గాండీవధారి అర్జున'. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా.. నాజర్, విమలా రామన్, వినయ్ రాజ్, అభినవ్ గోమటం కీలక పాత్రలు చేశారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.

Gandeevadhari Arjuna

వరుణ్ తేజ్ మూవీ బిజినెస్ ఇలా: వరుణ్ తేజ్ నటించిన 'గాండీవధారి అర్జున' చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీనికి దాదాపు రూ. 42 కోట్లు వరకూ బడ్జెట్ అయినట్లు తెలిసింది. ఇక, ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉన్నా బిజినెస్ మాత్రం ఆశించిన రీతిలో జరగలేదని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా వరుణ్ తేజ్ సినిమా రూ. 18 కోట్లు వరకూ బిజినెస్ చేసుకుందట.

అలాంటి టాక్.. రెస్పాన్స్ డల్‌గా: క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'గాండీవధారి అర్జున' మూవీకి అమెరికాలో వేసిన ప్రీమియర్ షోల నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే సీన్ కనిపించింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన ఆశించిన రీతిలో దక్కలేదు. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు మొదటి రోజు తక్కువగా కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు.

Varun Tej Starrer Gandeevadhari Arjuna Movie Day 1 Official Box Office Collections

మొదటి తెలుగు రాష్ట్రాల్లో ఇలా: ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన 'గాండీవధారి అర్జున' సినిమాకు ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే తక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 60 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కలిపి రూ. 65 లక్షలు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు రూ. 1.40 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 75 లక్షలు షేర్ వసూలైంది.

Varun Tej Starrer Gandeevadhari Arjuna Movie Day 1 Official Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఫస్ట్ డే ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 1.40 కోట్లు గ్రాస్ మాత్రమే రాబట్టిన 'గాండీవధారి అర్జున' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలుపుకుని కేవలం రూ. 50 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.90 కోట్లు గ్రాస్, రూ. 1.00 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది.

టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?: యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'గాండీవధారి అర్జున' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18.00 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 1.00 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో రూ. 17.00 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Varun Tej Starrer Gandeevadhari Arjuna Movie Day 1 Official Box Office Collections

ఆ డిజాస్టర్ కంటే తక్కువగానే: వరుణ్ తేజ్ నటించిన చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వస్తుంది. కానీ, తాజాగా వచ్చిన 'గాండీవధారి అర్జున' సినిమా మాత్రం దారుణమైన వసూళ్లతో నిరాశ పరిచింది. ఈ సినిమా కేవలం రూ. 75 లక్షలే వసూలు చేసింది. దీంతో వరుణ్ తేజ్ డిజాస్టర్ మూవీల కంటే తక్కువ మొత్తాన్ని రాబట్టినట్లు అయింది. ఇదే కంటిన్యూ అయితే భారీ నష్టాలు తప్పేలా లేవు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X