Operation Valentine 7 Days Collections: 17 కోట్లు వస్తే హిట్.. వారంలో దారుణంగా.. వరుణ్ కెరీర్‌లోనే!
టాలీవుడ్‌లోకి మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకున్నారు. వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. చాలా కాలం పాటు వరుసగా హిట్లను సాధించిన అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం ఫ్లాపుల పరంపరతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న లక్ష్యంతో 'ఆపరేషన్ వాలెంటైన్' అనే మూవీ చేశాడు. దీనికి డీసెంట్ టాక్ వచ్చినా.. రెస్పాన్స్ రావట్లేదు. ఫలితంగా కలెక్షన్లు పడిపోతూనే ఉన్నాయి. మరి ఈ చిత్రం 7 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!
ఎయిర్‌ఫోర్స్‌తో వచ్చిన హీరో:మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా సినిమానే 'ఆపరేషన్ వాలెంటైన్'. ఎయిర్‌ఫోర్స్ స్టోరీతో శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో మానుషి చిల్లర్ హీరోయిన్‌గా.. రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలను చేశారు.

వరుణ్ మూవీకి ప్రీ బిజినెస్:వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్'కు నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 7.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 14.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా పస్ల్ ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 17.00 కోట్లు బిజినెస్ జరిగింది.
7వ రోజు ఎంత వచ్చింది?:సర్జికల్ స్ట్రయిక్స్‌కు సంబంధించి నిజంగా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి మొదటి రోజు నుంచే తక్కువ రెస్పాన్స్ లభిస్తోంది. ఇలా 7వ రోజు ఈ సినిమాకు చాలా తక్కువ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 8 లక్షలు షేర్, రూ. 15 లక్షలు గ్రాస్‌ను మాత్రమే వసూలు చేసుకుంది.

7 రోజులకు కలిపి ఎంత?:వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి ఏడు రోజుల్లో చాలా తక్కువగానే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో నిరాశ పరుస్తూనే ఉంది. తద్వారా నైజాంలో రూ. 1.04 కోట్లు, సీడెడ్‌లో రూ. 29 లక్షలు, ఆంధ్రా మొత్తంలో కలిపి రూ. 1.28 కోట్లు రాబట్టింది. ఇలా 7 రోజుల్లో ఈ సినిమా రూ. 2.61 కోట్లు షేర్, రూ. 4.85 కోట్లు గ్రాస్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 7 రోజుల్లో రూ. 2.61 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలుపుకుని రూ. 80 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 7 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 3.42 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.20 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18.00 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లో వరుణ్ తేజ్ సినిమాకు రూ. 3.42 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 14.58 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ అవుతుంది. కానీ, ఇది వరుణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యే దిశగా వెళ్తోంది.


Click it and Unblock the Notifications











