Veer Zaara Re Release Collections: షారుక్ మూవీ డిజాస్టర్ కలెక్షన్లు.. ఎన్ని లక్షలు వచ్చాయంటే?
తెలుగులో రికార్డు కలెక్షన్లు సాధిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్‌లో కూడా రీ రిలీజ్ సంబరాలు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో రహనా హై తేరే దిల్ మే రిలీజై మంచి వసూళ్లు సాధించింది. తాజాగా బాలీవుడ్‌లో తుంబాడ్, వీర్ జారా చిత్రాలు రీ రిలీజ్ అయ్యాయి. అయితే తుంబాడ్ చిత్రం భారీగా కలెక్షన్లు రాబడితే.. వీర్ జారా మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, ప్రీతి జంటా నటించిన ప్రేమ కథా చిత్రం 2003 సంవత్సరంలో భారీ విజయం అందుకొన్నది. పాకిస్థాన్ పొలిటిషియన్ కూతురు (ప్రీతి జింటా), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ (షారుక్ ఖాన్) మధ్య జరిగే కథను ప్రముఖ దర్శకుడు యష్ చోప్రా దర్శకత్వం వహించారు.

ఆదిత్య చోప్రా కథను అందించగా.. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై యష్ రాజ్ చోప్రా, ఆదిత్య చోప్రా ఇద్దరు కలిసి 26 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో 100 కోట్లకుపైగా గ్రాస్, కోట్ల షేర్ వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అప్పట్లో వీర్ జారా చిత్రం తొలి రోజు 2.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తే.. తొలివారాంతం 10 కోట్ల రూపాయలు, తొలివారం 18 కోట్లు వసూలు చేసింది. అప్పట్లో ప్రేక్షకులు ఈ సినిమాపై మంచి ఆదరణను చూపించారు.

అలాంటి ప్రేక్షకాదరణ పొందిన సినిమాను ఇటీవల అంటే సెప్టెంబర్ 12వ తేదీన మళ్లీ రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 300 స్క్రీన్లలో రిలీజ్ చేసి.. రోజుకు ఒక షో మాత్రమే ప్రదర్శించారు. అయితే ఈ సినిమాకు అంతగా ప్రేక్షకుల నుంచి రెస్సాన్స్ రాకపోవడం ట్రేడ్ వర్గాలను షాక్ గురి చేసింది. ఈ సినిమా కంటే తుంబాడ్ చిత్రం రికార్డు వసూళ్లు సాధించిందడం ఆశ్చర్యానికి గురి చేసింది.
వీర్ జారా చిత్రం తొలి రోజు 20 లక్షలు నికరంగా, రెండో రోజు 30 లక్షలు, మూడో రోజు 20 లక్షలు, నాలుగో రోజు 20 లక్షలు, ఐదో రోజు 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 1.3 కోట్ల నికరంగా వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











