Veera Dheera Soora Day 7 Collection : కూల్‌గా రాబడుతోన్న విక్రమ్.. వీర ధీర శూరకు ఎన్ని కోట్లంటే?
ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన చిత్రం వీర ధీర శూర. దుషార విజయన్ కథానాయిక. రంజాన్, ఉగాది పండుగల కానుకగా మార్చి 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడి, 30 ఇయర్స్ పృథ్వీ, సిద్ధిఖీ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు అందించారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు ఈ చిత్రాన్ని దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. వీకెండ్, ఫెస్టివల్ సీజన్‌లో రాణించిన వీర ధీర శూర ఏడో రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
వీర ధీర శూరకు ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 31 కోట్ల షేర్.. రూ. 64 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ చిత్రానికి తొలి రోజు రూ.3.2 కోట్లు , రెండో రోజు రూ. 3.7 కోట్లు, నాలుగో రోజు రూ. 5.5 కోట్లు, నాలుగో రోజు రూ. 6.75 కోట్లు, ఐదవ రోజు రూ. 4.5 కోట్లు, ఆరవ రోజు రూ.2.75 కోట్లు చొప్పున వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు రూ. 3.5 కోట్ల కలెక్షన్స్ అందుకుంది.

తమిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో విడుదలైన వీర ధీర శూర చిత్రం ఇక్కడ ఆశించినంత స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది. తొలి రోజు రూ.30 లక్షలు, రెండో రోజు రూ. 20 లక్షలు, మూడో రోజు రూ.20 లక్షలు, నాలుగో రోజు రూ.30 లక్షలు, ఐదవ రోజు రూ.20 లక్షలు, ఆరవ రోజు రూ.10 లక్షల చొప్పున వసూలు చేశాడు విక్రమ్. తెలుగులో తగిన స్థాయిలో ప్రమోట్ చేయకపోవడం వీర ధీర శూరను దెబ్బ కొట్టిందని అంటున్నారు విశ్లేషకులు.
ఇక ఏడో రోజు వసూళ్ల విషయానికి వస్తే .. వీర ధీర శూరకు బాగానే హోల్డ్ చేసింది. తమిళ్ వెర్షన్‌కు ఓవరాల్‌గా 18.07 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. ఇక్కడ సెకండ్ షోలకు 24.04 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ వెల్లడించింది. ఈ సెకండ్ షోలే సినిమా వసూళ్లు స్టడీగా ఉండటానికి తోడ్పడుతున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక తెలుగు వెర్షన్‌లోనూ ఏడవ రోజు బాగానే హోల్డ్ చేసిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ అన్ని షోలకు కలిపి థియేటర్‌లలో 17.58 శాతం ఆక్యూపెన్సీ నమోదవ్వగా.. మ్యాట్నీ, సెకండ్ షోలకు మంచి ఆదరణ లభిస్తోంది.
ఏడవ రోజు ప్రపంచవ్యాప్తంగా వీర ధీర శూర చిత్రం రూ.1.85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సాక్ నిక్ తెలిపింది. మొత్తంగా ఇప్పటి వరకు విక్రమ్ చిత్రం ఇండియాలో రూ.30.8 కోట్ల గ్రాస్ సాధించగా.. నికరంగా రూ.28.18 కోట్లు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్‌లో రూ.3.5 కోట్లు, తెలుగులో రూ.1.37 కోట్లు రాబట్టింది. మొత్తంగా ఏడు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.34.3 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.27 కోట్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం తమిళ్‌లో పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో వీర ధీర శూర ఈ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు పుష్కళంగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











