Veera Dheera Soora Closing Collections : వీర ధీర శూర హిట్టా? ఫట్టా? విక్రమ్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం వీర ధీర శూర. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్, దుషార విజయన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని రియా శిబు, షిబు థమిన్స్ నిర్మించారు. ఎస్‌జే సూర్య , సూరజ్ వెంజరమూడి, 30 ఇయర్స్ పృథ్వీ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? ఈ సినిమాకు లాభమా? నష్టమా? అనే వివరాల్లోకి వెళితే..

తంగలాన్ డిజాస్టర్‌తో డైలమాలో ఉన్న చియాన్ విక్రమ్‌ తప్పనిసరిగా హిట్ సాధించాల్సిన సమయంలో వీర ధీర సూరతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రయోగాలకు దూరంగా కమర్షియల్ , మాస్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను మెప్పించాలని అనుకున్నారు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణల ఎంపిక, ప్రమోషనల్ కార్యక్రమాలు వీర ధీర సూరపై మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.

Veera Dheera Soora Movie Box Office Closing Collections Worldwide How much loss or profit for Vikram Movie

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. వీర ధీర సూర సినిమాను హెచ్ఆర్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. విక్రమ్ ఇమేజ్, టెక్నికల్ స్టాండర్డ్స్ ఏమాత్రం తగ్గకుండా వీర ధీర శూరను తెరకెక్కించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాను దాదాపుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

వీర ధీర శూ సినిమా టీజర్లు, ట్రైలర్లు, విక్రమ్ గెటప్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో తంగలాన్ ఫ్లాప్‌ను పట్టించుకోకుండా వీర ధీర శూరకు బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ , రెస్టాఫ్ ఇండియా కలిపి వీర ధీర శూర థియేట్రికల్ రైట్స్ బాగానే అమ్ముడయ్యాయి. ఈ సినిమా మొత్తంగా 34 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌ జరిగింది. వీర ధీర శూర హిట్ కావాలంటే రూ.35 కోట్ల షేర్, రూ.70 కోట్ల గ్రాస్ రావాలని ట్రేడ్ పండితులు నిర్దేశించారు.

వీర ధీర శూర కలెక్షన్ల విషయానికి వస్తే.. న్యాయపరమైన చిక్కుల కారణంగా తొలి రోజు సగం షోలు పడకపోవడంతో అది కలెక్షన్స్‌పై పడింది. ఈ సినిమాకు తొలి రోజు 3.2 కోట్ల రూపాయల నెట్, రెండో రోజు రూ.3.7 కోట్ల నెట్, మూడో రోజు రూ.5.5 కోట్ల నెట్, నాలుగో రోజు రూ.6.75 కోట్ల నెట్, ఐదో రోజు రూ.4.5 కోట్ల నెట్, ఆరో రోజు రూ.2.75 కోట్ల నెట్, ఏడో రోజు రూ.2.1 కోట్ల నెట్, ఎనిమిదవ రోజు రూ.1.75 కోట్ల నెట్, తొమ్మిదో రోజు రూ.1.7 కోట్ల నెట్, పదో రోజు రూ.2.6 కోట్ల నెట్, పదకొండవ రోజు రూ.2.85 కోట్ల నెట్, పన్నెండవ రోజు రూ.1.2 కోట్ల నెట్, పదమూడవ రోజు రూ.1.1 కోట్ల నెట్, పద్నాలుగో రోజు రూ.1.05 కోట్ల నెట్, పదిహేనవ రోజు రూ.34 లక్షలు ఆర్జించింది.

మొత్తంగా 15 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.63.45 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియా వైడ్ నికరంగా రూ.40.99 కోట్లు .. 47.45 కోట్ల గ్రాస్‌ , ఓవర్సీస్‌లో రూ.16 కోట్లు రాబట్టింది వీర ధీర శూర. అలాగే తమిళనాడులో నికరంగా 39.3 కోట్లు, తెలుగులో 1.69 కోట్ల నెట్ సాధించింది విక్రమ్ సినిమా.

Veera Dheera Soora Movie Box Office Closing Collections Worldwide How much loss or profit for Vikram Movie

వీర ధీర శూర థియేట్రికల్ వాల్యూ ప్రకారం చూస్తే .. ఈ సినిమా రూ.7 కోట్ల నష్టంతో తన థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 15 రోజుల వరకు రోజుకు కోటి రూపాయలు తగ్గకుండా వసూళ్లు సాధించి 88 శాతం రికవరీ సాధించింది ఈ చిత్రం. అయితే ఏప్రిల్ 10న అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి వీర ధీర శూరకు గట్టి పోటీ ఎదురవుతోంది.

రానున్న రోజుల్లో విక్రమ్ సినిమాకు కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్ బడ్జెట్ ప్రకారం చూస్తే వీర ధీర శూరకు భారీ లాభాలే వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో హక్కులు .. ఈ నష్టాన్ని కొంత తగ్గించే అవకాశం కనిపిస్తోందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద వరుస ఫ్లాపుల్లో ఉన్న విక్రమ్ కెరీర్‌కు వీర ధీర శూర ఏ మాత్రం ఊరట ఇవ్వలేదని కోలీవుడ్ మీడియా టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X