Veera Simha Reddy Closing Collections వీరసింహారెడ్డి హిట్టా? ఫట్టా? బాలకృష్ణ మూవీకి లాభనష్టాలు ఎంతంటే?
నందమూరి బాలకృష్ణ, మలినేని గోపిచంద్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా వచ్చిన వీరసింహారెడ్డి చిత్రం తొలివారంలో రికార్డు వసూళ్లను సొంతం చేసుకొన్నది. అయితే సంక్రాంతి పండుగ సీజన్‌లో భారీ సినిమాలు రిలీజ్ కావడంతో రెండోవారంలో తక్కువ థియేటర్లకు పరిమితం కావడంతో బాక్సాఫీస్ వద్ద అదే జోష్ చూపించలేకపోయింది. అయితే బాలకృష్ణ కెరీర్‌లో బెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా మాత్రం నిలిచింది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

వీరసింహారెడ్డి బడ్జెట్, బిజినెస్
వీర సింహారెడ్డి సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. సుమారు 110 కోట్లతో సినిమాను తెరకెక్కించారు. ఇక రిలీజ్‌కు ముందు చేసిన బిజినెస్ విషయంలోకి వెళ్తే.. నైజాంలో 15 కోట్లు, సీడెడ్‌లో 13 కోట్లు, ఆంధ్రాలో 45 కోట్లు మేర బిజినెస్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్లుగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ఇక కర్నాటక 4 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 1 కోటి, ఓవర్సీస్‌లో 6 కోట్లుగా బిజినెస్ జరిగింది. దాంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 75 కోట్లుగా నిర్ణయించారు.

వీరసింహారెడ్డి థియేటర్ కౌంట్
వీరసింహారెడ్డి సినిమాను భారీగా థియేటర్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 1500 స్క్రీన్లలో విడుదల చేశారు. నైజాంలో 275 స్కీన్లు, సీడెడ్‌లో 200 స్క్రీన్లు, ఆంధ్రాలో 410 స్క్రీన్లతో తెలుగు రాష్ట్రాల్లో 885 స్క్రీన్లలో రిలీజైంది. కర్నాటక, ఇతర రాష్ట్రాల్లో 90 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 525 స్క్రీన్లలో అట్టహాసంగా రిలీజ్ చేయడం జరిగింది.

తొలివారం రికార్డు కలెక్షన్లు
జూన్ 12వ తేదీన రిలీజైన వీరసింహారెడ్డి చిత్రం బాలకృష్ణ కెరీర్‌లోనే ఎన్నడూ లేని విధంగా రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 39 కోట్లకుపైగా వసూళ్లను సాధించడం ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు. తొలివారం ఈ చిత్రం 102 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక రెండోవారంలో పేలవమైన వసూళ్లను నమోదు చేసింది. రెండోవారంలో కేవలం 8.4 కోట్లు మాత్రమే రాబట్టడం గమనార్హం. మూడోవారంలో సుమారు 2 కోట్లకుపైగా వసూళ్లను సాధించడంతో దేశీయంగా 113 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది.

రాష్ట్రాల వారీగా వీరసింహారెడ్డి వసూళ్లు
ఇక వీరసింహారెడ్డి రాష్ట్రాల వారీగా సాధించిన వసూళ్ల విషయానికి వస్తే.. కర్ణాటకలో 9 కోట్లకుపైగా కలెక్షన్లను, తెలుగు రాష్ట్రాల్లో 1.2 కోట్లు, తమిళనాడులో 1 కోటి రూపాయలకుపైగా, ఇతర రాష్ట్రాల్లో 19 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 113 కోట్ల వద్ద స్థిరపడింది. రానున్న రోజుల్లో మొత్తంగా 115 కోట్ల వద్ద ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ ముగిసే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా వీరసింహారెడ్డి
అలాగే వీరసింహారెడ్డి సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 113 కోట్లకుపైగా గ్రాస్, 95 కోట్ల షేర్ సాధించింది. ఇక ఓవర్సీస్‌లో 15 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 130 కోట్ల కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.

వీరసింహారెడ్డికి లాభమెంత అంటే?
వీరసింహారెడ్డి సినిమా 75 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా 95 కోట్ల షేర్ రాబట్టింది. దాంతో 20 కోట్లు థియేట్రికల్‌గా, నాన్ థియేట్రికల్ (ఓటీటీ, స్టార్ మా) బిజినెస్ 60 కోట్లు చేసింది. దాంతో ఈ సినిమా సుమారు 80 కోట్ల వరకు లాభాలను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications











