Veera Simha Reddy's Collections థియేటర్లు తగ్గినా తగ్గని బాలయ్య జోరు.. 6వ రోజు షాకింగ్‌గా కలెక్షన్లు

నటసింహం నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా మలినేని గోపిచంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం వీరసింహారెడ్డి. సిస్టర్ సెంటిమెంట్‌తోపాటు యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం తొలి ఆట నుంచే భారీగా కలెక్షన్లు రాబడుతున్నది. అయితే తొలి రోజు కంటే ఆ తర్వాత థియేటర్ల సంఖ్య తగ్గిపోవడంతో కలెక్షన్లు మందగించాయి. అయితే వీరసింహారెడ్డి 6వ రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

వీరసింహారెడ్డి చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత వసూళ్లను బాక్సాఫీస్ వద్ద నిలుపుకోలేకపోయింది. అయినా నిలకడగానే వసూళ్లను సాధిస్తున్నది. థియేటర్ల కౌంట్ తగ్గిపోవడంతో కలెక్షన్లపై భారీగా ప్రభావం పడింది. వీరసింహారెడ్డికి థియేటర్లు తగ్గించారనే కోపంతో మైత్రీ నిర్మాతలపై నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Veera Simha Reddys day 6 expected Collections worldwide

వీరసింహారెడ్డి అనేక ఒడిదుడుకుల మధ్య గత ఐదు రోజుల్లో రికార్డుస్థాయి వసూళ్లను రాబడుతున్నది. గత ఐదు రోజుల్లో ఏపీ, నైజాంలో 51 కోట్ల షేర్, 82 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల షేర్, 100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. గత ఐదు రోజుల్లో 108 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ఇక వీరసింహారెడ్డి 6వ రోజు బాక్సాఫీస్ పరిస్థితి విషయానికి వస్తే.. భారీగానే ఆక్యుపెన్సీ కనిపించింది. హైదరాబాద్‌లో 42 శాతం, బెంగళూరులో 32 శాతం, చెన్నైలో 44 శాతం, విజయవాడలో 40 శాతం, వరంగల్‌లో 40 శాతం, గుంటూరులో 28 శాతం, వైజాగ్‌లో 58 శాతం, కాకినాడలో 78 శాతం, నెల్లూరులో 80 శాతం కలెక్షన్లు సాధించింది.

అమెరికాలో వీరసింహారెడ్డి చిత్రం 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. బాలకృష్ణ తన కెరీర్‌లో అమెరికాలో 1 మిలియన్ డాలర్లను వసూలు చేయడం ఇది మూడోసారి. గతంలో గౌతమీ పుత్ర శాతకర్ణి, అఖండ సినిమాలతో ఈ ఫీట్ సాధించారు. ఈ చిత్రం మిగితా దేశాలతో కలుపుకొని దాదాపు 13 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Veera Simha Reddys day 6 expected Collections worldwide

వీరసింహారెడ్డి గత ఐదు రోజుల్లో ఓవర్సీస్‌లో దుమ్ము రేపుతున్నది. ఆస్ట్రేలియాలో 85 లక్షలు, న్యూజిలాండ్లో 4 లక్షలు, యూకేలో 1 కోటి రూపాయలు, యూఏఈలో 45 లక్షలు, మిగితా అరబ్ దేశాల్లో 23 లక్షలు, సింగపూర్, కెనడా, యూరప్‌లో కలిపి 50 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 13 కోట్లు రాబట్టింది.

ఇక వీరసింహారెడ్డి చిత్రం 6వ రోజున నిలకడగా వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో కలిపి 7 కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఒవర్సీస్‌లో మరో 1 కోటి రూపాయలు వసూలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో ఈ సినిమా 6వ రోజు 115 కోట్ల వద్ద స్థిరపడే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X