Veera Simha Reddy: అప్పుడే అన్ని కోట్లతో ఊచకోత.. అఖండ రికార్డు బ్రేక్ చేసిన వీరసింహారెడ్డి
టాలీవుడ్‌లోకి బ్యాగ్రౌండ్‌తో వచ్చినా కెరీర్ ఆరంభంలోనే తనలోని టాలెంట్లను నిరూపించుకుని.. దాదాపు నలభై ఏళ్లుగా స్టార్‌గా సత్తా చాటుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అంతేకాదు, హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఇలంటి పరిస్థితుల్లో గత ఏడాది 'అఖండ'తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య.. ఇప్పుడు 'వీరసింహారెడ్డి' అనే సినిమాను చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీకి తాజాగా భారీ ఆఫర్ వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

అఖండతో రెట్టించిన జోష్
గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ తర్వాత నందమూరి బాలకృష్ణ చాలా కాలం పాటు విజయాలను సొంతం చేసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గత ఏడాది వచ్చిన 'అఖండ' మూవీతో మరోసారి విజయాల బాటలోకి వచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో బాలయ్య కెరీర్‌లోనే దీనికి అత్యధిక వసూళ్లు రావడంతో బిగ్ హిట్ అయింది.

వీరసింహారెడ్డిగా బాలయ్య
నటసింహా బాలకృష్ణ 'అఖండ' తర్వాత మరింత ఉత్సాహంగా కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఇందులో భాగంగానే 'క్రాక్' మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రస్తుతం 'వీరసింహారెడ్డి' అనే ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై అప్పుడే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

బాలయ్యతో పాటు ఆ స్టార్లు
'వీరసింహారెడ్డి' మూవీలో నందమూరి బాలకృష్ణకు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతాన్ని ఇస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు.

షూట్ స్పీడుగా.. పొంగల్‌కు
గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న 'వీరసింహారెడ్డి' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా చిత్ర యూనిట్ కంప్లీట్ చేసేసింది. ఇప్పుడు అనంతపురం ఏరియాలో పది రోజలు పాటు షూటింగ్ జరుపుకుంటోంది. ఇక, ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

భారీ బిజినెస్‌కు హక్కులు
ఫ్యాక్షన్ బ్యాగ్‌డ్రాప్‌తో పవర్‌ఫుల్ స్టోరీతో రాబోతున్న 'వీరసింహారెడ్డి' సినిమాపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికితోడు ఈ మూవీ నుంచి వచ్చే అప్‌డేట్ల వల్ల ఇది మరింత రీచ్ అవుతోంది. దీంతో ఈ చిత్రం రైట్స్ కోసం డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయిందని టాక్.

సీడెడ్ రైట్స్‌కు భారీ రేటు
పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో రాబోతున్న 'వీరసింహారెడ్డి' సినిమా హక్కుల కోసం పోటీ ఓ రేంజ్‌లో ఏర్పడింది. మరీ ముఖ్యంగా బాలయ్యకు మంచి మార్కెట్ ఉన్న సీడెడ్ ఏరియా హక్కుల కోసం చాలా మంది బడా సంస్థలు పోటీ పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా సీడెడ్ హక్కులు రూ. 12.50 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.

అఖండ రికార్డు బ్రేక్ చేస్తూ
బాలయ్య గత బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ 'అఖండ' సీడెడ్ హక్కులు రూ. 10.60 కోట్లు అమ్ముడయ్యాయి. అయితే, అక్కడ ఏకంగా రూ. 16.05 కోట్ల వసూళ్లు వచ్చాయి. దీంతో 'వీరసింహారెడ్డి'కి అక్కడ భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు దీని హక్కులు రూ. 12.50 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో బాలయ్య సీడెడ్ ఏరియాలో రికార్డును నమోదు చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











