Veera Simha Reddy: రికార్డులు బ్రేక్ చేసిన బాలయ్య.. ఒక్క ఏరియాకే అన్ని కోట్లతో సంచలనం
బడా బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ సత్తా చాటుతూ స్టార్ హీరోగా చెలామణీ అవుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలా సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరించే సినిమాలతో సందడి చేస్తోన్న ఆయన.. గత ఏడాది నుంచి మరింత ఉత్సాహంతో ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేనితో 'వీరసింహారెడ్డి' అనే సినిమాను చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టత్మకంగా రాబోతున్న ఈ మూవీకి భారీ ఆఫర్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..!

కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సొంతం
చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయిన బాలయ్య.. గత ఏడాది 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక సినిమా భారీ అంచనాలతో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో బాలయ్య మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. అంతేకాదు, ఈ చిత్రంతో కలెక్షన్ల పరంగా ఆయన బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.

మరో మస్ సినిమాలో బాలయ్య
'అఖండ' తర్వాత నటసింహా బాలకృష్ణ రెట్టించిన జోష్‌తో కొత్త సినిమాలను లైన్‌లో పెట్టుకున్నారు. ఇందులో 'క్రాక్' మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రస్తుతం 'వీరసింహారెడ్డి' అనే ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ క్రేజీ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు.

క్రేజీ కాంబోలోనే వీరసింహారెడ్డి
'వీరసింహారెడ్డి' మూవీలో నందమూరి బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

షూటింగ్ స్పీడ్‌గా.. సంక్రాంతికే
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'వీరసింహారెడ్డి' మూవీ షూటింగ్ ఫిబ్రవరి నుంచే ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా చిత్ర యూనిట్ కంప్లీట్ చేసేసింది. ఇలా ఇప్పటి వరకూ దాదాపు 80 శాతం పైగా టాకీ పార్టును పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తున్నట్లు ఇటీవలే వెల్లడించారు.

రికార్డు రేటుకు మూవీ బిజినెస్
బాలయ్య హీరోగా గోపీచంద్ తెరకెక్కిస్తోన్న 'వీరసింహారెడ్డి' సినిమాపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికితోడు ఈ మూవీ నుంచి వచ్చే అప్‌డేట్ల వల్ల ఇది మరింత రీచ్ అవుతోంది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్ కోసం భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఫలితంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

ఓవర్సీస్ రైట్స్ ఆ సంస్థ చేతికి
బాలకృష్ణ హీరోగా ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'వీరసింహారెడ్డి' సినిమా హక్కులకు అప్పుడే పోటీ ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ మూవీ ఓవర్సీస్ ఏరియా హక్కుల కోసం చాలా మంది బడా సంస్థలు పోటీ పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏరియా హక్కులను ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏకంగా రూ. 4 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.

అఖండ రికార్డు బ్రేక్ చేసేసింది
బాలయ్య గత బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ 'అఖండ' ఓవర్సీస్ హక్కులు రూ. 2.50 కోట్లు అమ్ముడయ్యాయి. అయితే, అక్కడ ఏకంగా రూ. 5.50 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీంతో 'వీరసింహారెడ్డి'కి భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు దీని హక్కులు రూ. 4 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో బాలయ్య ఖాతాలో టాప్ రికార్డు వచ్చి చేరింది.


Click it and Unblock the Notifications











