Veera Simha Reddy's Day 3 Collections బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ ఊచకోత.. మరో రికార్డుకు చేరువగా..

నటసింహం నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా మైత్రీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు మలినేని గోపిచంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం వీరసింహారెడ్డి. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తున్నది. తొలి రోజే బాలకృష్ణ కెరీర్‌లో బెస్ట్ కలెక్షన్లను సాధించిన ఈ చిత్రం అదే జోష్‌ను కొనసాగిస్తున్నది. ఈ సినిమా మూడో రోజు కలెక్షన్ల అంచనాల ఎలా ఉందంటే?

వీర సింహారెడ్డి రెండు రోజుల కలెక్షన్లు

వీర సింహారెడ్డి రెండు రోజుల కలెక్షన్లు


వీరసింహారెడ్డి చిత్రం తొలి రోజున హిట్ టాక్‌తో విజృంభించింది. దాంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు నమోదయ్యాయి. తొలి రోజున ఇండియావైడ్ 33.6 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకుపైగా గ్రాస్, 37 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యుత్తమ రికార్డుగా మారింది. అయితే రెండో రోజున వాల్తేరు వీరయ్య కోసం థియేటర్లు తగ్గించడంతో రెండో రోజు వీరసింహారెడ్డి కలెక్షన్లు భారీగా తగ్గి.. 9 కోట్ల మేర వసూళ్లను దేశవ్యాప్తంగా రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా రెండురోజుల్లో

ప్రపంచవ్యాప్తంగా రెండురోజుల్లో


వీర సింహారెడ్డి గత రెండో రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియా వైడ్ 50 కోట్ల గ్రాస్, 43 కోట్ల షేర్ సాధించింది. ఇక ఓవర్సీస్‌లో 10 కోట్లు సాధించడంతో ఈ చిత్రం రెండు రోజుల్లో 61 కోట్ల గ్రాస్, 37 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో 100 కోట్ల క్లబ్‌పై దృష్టి పెట్టింది.

3వ రోజు ఆక్యుపెన్సీ

3వ రోజు ఆక్యుపెన్సీ


ఇక వీరసింహారెడ్డి మూడో రోజు బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందనే పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో 62 శాతం ఆక్యుపెన్సీ, బెంగళూరులో 44 శాతం, చెన్నైలో 60 శాతం, విజయవాడలో 52 శాతం, గుంటూరులో 57 శాతం, వైజాగ్‌లో 63 శాతం, నిజమాబాద్‌లో 25 శాతం, కరీంనగర్‌లో 75 శాతం, కాకినాడలో 64 శాతం,నెల్లూరులో 87 శాతం, ఢిల్లీలో 10 శాతం, ముంబైలో 20 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

 తెలుగు రాష్ట్రాల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్

తెలుగు రాష్ట్రాల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్


వీరసింహారెడ్డి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. హైదరాబాద్‌లో 60 శాతం ఆక్యుపెన్సీతో మూడో రోజు 1.78 కోట్లు కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే రాబట్టింది. రాయలసీమలో మూడో రోజు కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నది. సీడెడ్, ఆంధ్రాలో కూడా భారీగా కలెక్షన్లను నమోదు చేస్తన్నది.

 అమెరికాలో కలెక్షన్ల రచ్చ

అమెరికాలో కలెక్షన్ల రచ్చ


వీరసింహారెడ్డి చిత్రం ఓవర్సీస్‌లో తొలి రెండు రోజుల్లో రాబట్టిన కలెక్షన్ల మాదిరిగానే మూడో రోజు కూడా అదే జోష్‌ను కొనసాగిస్తున్నది. రెండో రోజు కంటే.. మూడో రోజు థియేటర్లను పెంచారు. అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం మూడో రోజు 304 లోకేషన్లలో 705 షోల ద్వారా 31K డాలర్లను వసూలు చేసింది. దాంతో ఓవర్సీస్‌లోనే ఈ చిత్రం దాదాపు 11 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

మూడో రోజు వీరసింహారెడ్డి కలెక్షన్లు

మూడో రోజు వీరసింహారెడ్డి కలెక్షన్లు


ఇక వీరసింహారెడ్డి సినిమాకు సంక్రాంతి పండుగ సానుకూలంగా మారింది. విడుదలైన ప్రతీచోట మంచి కలెక్షన్లను నమోదు చేస్తున్నది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్రలతో కలిపి ఈ చిత్రం మూడో రోజు 15 కోట్ల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ రేంజ్‌లో కలెక్షన్లు సాధిస్తే.. గత రెండు రోజుల్లో 61 కోట్లతో కలిపి.. సుమారు 75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది.

వీరసింహారెడ్డి లాభాల్లోకి రావాలంటే?

వీరసింహారెడ్డి లాభాల్లోకి రావాలంటే?


వీరసింహారెడ్డి చిత్రం విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల మేర బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా 74 కోట్లు వసూలు చేస్తే లాభాల్లోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం మూడో రోజుల కలెక్షన్ల అంచనా సుమారు 45 కోట్లు ఉండే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం తొలి వారం తర్వాత లాభాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X