Veera Simha Reddy's Day4 Collections:మూడోసారి చరిత్ర సృష్టించిన బాలయ్య.100 కోట్లను కొల్లగొట్టిన వీరసింహారెడ్డి

ప్రపంచ తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద నందమూరి బాలకృష్ణ సందడి చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజైన వీరసింహారెడ్డి చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. శృతిహాసన్, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన ఈ చిత్రం రిలీజైన తొలి ఆట నుంచి విశేషంగా ఆదరణను సొంతం చేసుకొంటున్నది. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తున్నది. ఈ సినిమా 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తొలి రోజు 50 కోట్లతో

తొలి రోజు 50 కోట్లతో


వీరసింహారెడ్డి మూవీ తొలి రోజున బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించింది. తొలి రోజు 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరుసటి రోజు వాల్తేరు వీరయ్య, ఆ మరుసటి రోజు వారసుడు రిలీజ్ కావడంతో తక్కువ థియేటర్లలో వీరసింహారెడ్డి సినిమా ప్రదర్శించాల్సి వచ్చింది. అయితే నాసిరకమైన థియేటర్లు, చాలా తక్కువ థియేటర్లలో ప్రదర్శించానా.. కలెక్షన్లను జోరుగా వసూలు చేయడం సినిమా వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

గత నాలుగు రోజుల్లో ఇండియావైడ్

గత నాలుగు రోజుల్లో ఇండియావైడ్

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా వీరసింహారెడ్డి చిత్రం రికార్డు వసూళ్లు సాధిస్తున్నది. తొలి రోజు తెలుగు, కర్ణాటక, తమిళ రాష్ట్రాల్లో భారీగా వసూళ్లను రాబట్టింది. తొలి రోజు 33.6 కోట్లు, రెండో రోజు 8.6 కోట్లు, మూడో రోజు 10.4 కోట్లు, నాలుగో రోజు 11 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం దేశీయంగా 63.6 కోట్లు రాబట్టింది.

4వ రోజు ఏపీ, నైజాంలో

4వ రోజు ఏపీ, నైజాంలో

వీరసింహారెడ్డి 4 వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 2.27 కోట్లు, సీడెడ్‌లో 1.98 కోట్లు, ఉత్తరాంధ్రలో 73 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 61 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 33 లక్షలు, గుంటూరులో 51 లక్షలు, కృష్ణా జిల్లాలో 53 లక్షలు, నెల్లూరు జిల్లాలో 30 లక్షలు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తం కలిపి 7.25 కోట్ల షేర్, 12.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది

ఆంధ్రా, నైజాంలో గత నాలుగు రోజుల్లో

ఆంధ్రా, నైజాంలో గత నాలుగు రోజుల్లో

తెలుగు రాష్ట్రాల్లో కూడా వీరసింహారెడ్డి చిత్రం భారీగా కలెక్షన్లు సాధిస్తున్నది. సీడెడ్‌లో గత 4 రోజుల్లో 12.7 కోట్ల వసూళ్లు సాధించింది. జనవరి 16వ తేదీన సీడెడ్‌లో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.ఉత్తరాంధ్రలో 4.4 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 3.34 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 2.87 కోట్లు, గుంటూరులో 4.75 కోట్లు, కృష్ణా జిల్లాలో 2.96 కోట్లు, నెల్లూరు జిల్లాలో 1.92 కోట్లు వసూలు చేసింది.

అమెరికాలో బ్రేక్ ఈవెన్

అమెరికాలో బ్రేక్ ఈవెన్


వీరసింహారెడ్డి చిత్రానికి ఓవర్సీస్‌లో కూడా భారీ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ చిత్రం అమెరికాలో భారీ వసూళ్లను సాధిస్తున్నది. రిలీజ్‌కు ముందే 750K వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు నుంచి థియేటర్ల కొరత కారణంగా వసూళ్లు తగ్గిపోయాయి. అయినా పరిమితమైన థియేటర్లతో 1 మిలియన్ డాలర్లను సాధించింది. గతంలో గౌతమీ పుత్ర శాతకర్ణి, అఖండ చిత్రాలు 1 మిలియన్ డాలర్లు సాధించాయి

ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందంటే?

ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందంటే?

ఇక ప్రపంచ వ్యాప్తంగా వీరసింహారెడ్డి కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో 71 కోట్లకుపైగా గ్రాస్, 44.3 కోట్లకుపైగా గ్రాస్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 3.55 కోట్లు, ఓవర్సీస్‌లో 5 కోట్లకుపైగా సాధించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 60 కోట్లకుపైగా షేర్, 100 కోట్లకు చేరువలో గ్రాస్ కలెక్షన్లను సాధించింది. బాలకృష్ణ కెరీర్‌లో 100 కోట్లు సాధించిన మూడో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

వీరసింహారెడ్డి ప్రాఫిట్‌లోకి రావాలంటే?

వీరసింహారెడ్డి ప్రాఫిట్‌లోకి రావాలంటే?

వీరసింహారెడ్డి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది. దాంతో ఈ సినిమా 74 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ చిత్రం 60 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. దాంతో ఇంకా 20 శాతం రికవరీని సాధించాల్సిన అవసరం ఉంది. తొలి వారంలో వీరసింహారెడ్డి చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X