Veera Simha Reddy's first week Collections: ఆగని బాలయ్య ఊచకోత.. వీరసింహారెడ్డి కలెక్షన్ల పడిపోవడం వెనుక కారణం

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మాణంలో మలినేని గోపిచంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం వీరసింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా వరలక్ష్మీ శరత్ కుమార్, హానీ రోజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. హాలీడేస్‌లోనే కాకుండా వర్కింగ్ డే రోజున కూడా అనూహ్యమైన కలెక్షన్లు సాధిస్తున్నది. ఇప్పటికే 100 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం 7వ రోజు ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందంటే?

ఐదు రోజుల్లోనే 100 కోట్లు

ఐదు రోజుల్లోనే 100 కోట్లు

సక్రాంతి పండుగ కానుకగా జనవరి 11వ తేదీన రిలీజైన వీరసింహారెడ్డి చిత్రం రికార్డు కలెక్షన్లు రాబట్టింది. గత ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో 100 కోట్లు రాబట్టింది. బాలకృష్ణ కెరీర్‌లో ఈ సినిమా అత్యుత్తమ కలెక్షన్లను సాధిస్తున్నది. తొలివారం గడిచినా వసూళ్ల వేడి తగ్గలేదు. ఇంకా భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఓవర్సీస్‌లో ట్రాక్ రికార్డు

ఓవర్సీస్‌లో ట్రాక్ రికార్డు

వీరసింహారెడ్డి గత ఆరు రోజుల్లో ఓవర్సీస్‌లో రికార్ఢు స్థాయి వసూళ్లను రాబడుతున్నది. అమెరికాలో 1 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఆస్ట్రేలియాలో 90 లక్షలు, న్యూజిలాండ్లో 6 లక్షలు, యూకేలో 1.5 కోటి రూపాయలు, యూఏఈలో 50 లక్షలు, మిగితా అరబ్ దేశాల్లో 30 లక్షలు, సింగపూర్, కెనడా, యూరప్‌లో కలిపి 70 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం సుమారు 14 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది.

ఏపీ, తెలంగాణలో

ఏపీ, తెలంగాణలో

ఏపీలో గత 7 రోజుల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. సీడెడ్లో 13 కోట్ల షేర్ సాధించింది. కడపలో 1 కోటి రూపాయల గ్రాస్, నంద్యాల టౌన్‌లో 70 లక్షల గ్రాస్, కర్నూలులో 1.2 కోట్లు రాబట్టింది. ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో వీరసింహారెడ్డి కలెక్షన్లు బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా రాబట్టడం డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లలో జోష్ కనిపిస్తున్నది.

7వ రోజు ఆక్యుపెన్సీ

7వ రోజు ఆక్యుపెన్సీ

ఇక ఏడో రోజు వీరసింహారెడ్డి ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 37 శాతం, బెంగళూరు 29 శాతం, వరంగల్ 34 శాతం, వైజాగ్‌లో 41 శాతం, కాకినాడలో 50 శాతం, నెల్లూరులో 65 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. దాంతో ఈ సినిమా వర్కింగ్ డే రోజున కూడా కలెక్షన్ల తడాఖాను చూపిస్తున్నది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

ఇదిలా ఉండగా, 7వ రోజు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో కలిపి ఈ చిత్రం 6 కోట్ల రూపాయాలను కలెక్ట్ చేసింది. ఓవర్సీస్‌లో అన్ని ప్రాంతాల్లో కలుపుకొని 20 లక్షలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 114 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇంకా మరికొన్ని రోజులు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సందడి చేసే అవకాశం ఉంది.

బ్రేక్ ఈవెన్‌కు చేరువలో

బ్రేక్ ఈవెన్‌కు చేరువలో


వీరసింహారెడ్డి సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే కనీసం 75 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది. థియేటర్ల తగ్గింపు వ్యవహారం ఈ సినిమాపై భారీ ప్రభావం చూపుతున్నది అనే వాదన ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X