పండుగ వాతావరణంలో వీరభద్ర విడుదల
బాలకృష్ణ వీరభద్ర సినిమా రాష్ట్రంలోనూ పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లోనూ శనివారం ఉదయం పండుగ వాతావరణంలో విడుదలైంది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆయన అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. ఎంతో కాలంగా పెద్ద సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బాలకృష్ణ ఈ సినిమా మీద పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాపై తొలి టాక్ పాజిటివ్‌గా వచ్చింది. ఫస్టాఫ్‌లో డ్యాన్సులు ఫైట్స్ ఆయన అభిమానులను అలరించాయి. విలన్‌పై బాలకృష్ణ సంధించిన కొన్ని డైలాగులు పేలినట్టు సినిమా హాళ్ళలో మోగిన చప్పట్లను బట్టి చెప్పవచ్చు. వేసవి పెద్ద సినిమాల్లో పౌర్ణమి నిస్సందేహంగా ఫ్లాప్ కావడం, మహేష్ బాబు పోకిరికి హిట్ టాక్ రావడం వీరభద్ర కలెక్షన్లను ప్రభావితం చేయకపోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ బంగారం (మే 3న విడుదల) ప్రభావం మాత్రం వీరభద్ర మీద ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. మంచికి మంచి, పంచ్‌కి పంచ్ ట్యాగ్‌లైన్ గల వీరభద్ర సినిమాను అంబికాకృష్ణ నిర్మించగా ఎంఎల్ కుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. సంగీతం మణిశర్మ. హీరోయిన్లు తనూశ్రీ దత్తా, సదా.


Click it and Unblock the Notifications