‘వీరే ది వెడ్డింగ్’ వసూళ్లు అదుర్స్, 5 రోజుల్లో ఎంతంటే...
సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వర భాస్కర్, శిఖా తల్సానియా ప్రధాన పాత్రల్లో శశాంకా ఘోష్ దర్శకత్వంలో ఏక్తా కపూర్, రియా కపూర్ నిర్మించిన 'వీరే ది వెడ్డింగ్' చిత్రానికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. 2018లో విడుదలైన బాలీవుడ్ సినిమాల్లో టాప్ 5 ఓపెనర్లలో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది.

స్టార్ హీరోలు లేకుండా కేవలం హీరోయిన్లతో చేసే సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా వర్కౌట్ కావు అని భావించే వారు ఈ సినిమా వసూళ్లు చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. తొలి 5 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 48.03 కోట్లు వసూళ్లు రాబట్టింది.
అయితే ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చింది. కొందరు ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ గురించి బాగా చూపించారని ప్రశంసించగా, మరికొందరేమో బూతులు బాగా ఉన్నాయని విమర్శించారు. సినిమాలో ఎక్కువగా బ్రాండ్స్ ప్రమోషన్ జరిగిందని కొందరు అభిప్రాయ పడ్డారు.
ఎవరి వాదన ఎలా ఉన్నా యూత్‌ను ఈ మూవీ బాగా ఆకట్టుకుంటోంది. యువతుల గురించి గతంలో ఏ సినిమాలోనూ చూపని సీన్లు ఇందులో చూపించారు. ముఖ్యంగా యువతుల సెక్సువల్ కోరికలు, హస్తప్రయోగం లాంటివి వివాదాస్పదం అయ్యాయి.


Click it and Unblock the Notifications











