For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Life of Muthu Collections 50 కోట్ల క్లబ్‌లో శింబు.. నాలుగు రోజుల్లోనే భారీ కలెక్షన్లు

    |

    సెన్సేషనల్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో శింబు, సిద్ది ఇద్నానీ నటించిన లైఫ్ ఆఫ్ ముత్తు (తమిళంలో వేండు థానిందాతు కాడు) చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. సెప్టెంబర్ 15వ తేదీన రిలీజైన ఈ చిత్రం తమిళ భాషలో భారీ కలెక్షన్లను రాబడుతున్నది. గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం ఏ మేరకు కలెక్షన్లు సాధించిందంటే..

    లైఫ్ ఆఫ్ ముత్తు పార్ట్ 1

    లైఫ్ ఆఫ్ ముత్తు పార్ట్ 1


    వేండు థానిందాతు కాడు పార్ట్ 1 చిత్రం గ్యాంగ్‌స్టర్ డ్రామాతో ప్రేమ కథా చిత్రంగా రూపొందింది. ప్రముఖ రచయిత జయమోహన్ కథకు గౌతమ్ మీనన్ తెర రూపం కల్పించారు. ఈ సినిమాను ఇషారీ కే గణేష్ నిర్మించాడు. రాధిక శరత్ కుమార్, శైలజ తదితరులు నటించారు. ఈ చిత్రం తొలి ఆట నుంచి మంచి టాక్‌ను సంపాదించుకొన్నది.

     శింబు కెరీర్ బెస్ట్ అంటూ

    శింబు కెరీర్ బెస్ట్ అంటూ


    తమిళంలో చాలా గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన శింబు చిత్రంపై సినీ విమర్శకులు సానుకూలంగా స్పందించారు. శింబు కెరీర్ బెస్ట్ మూవీ అంటూ ప్రశంసలు కురిపించారు. పాజిటివ్ రివ్యూలు సినిమాకు పాజిటివ్‌గా మారాయి. దాంతో తొలి వారాంతం భారీ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది.

     తమిళనాడులో గత 4 రోజుల్లో

    తమిళనాడులో గత 4 రోజుల్లో


    శింబు నటించిన వేండు థానిందాతు కాడు (లైఫ్ ఆఫ్ ముత్తు) చిత్రం తమిళనాడులో తొలి రోజు నుంచి భారీ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం గురువారం సెప్టెంబర్ 15వ తేదీన 7.5 కోట్లు రాబట్టింది. శుక్రవారం అంటే రెండో రోజు 7 కోట్లు వసూలు చేసింది. శనివారం మూడో రోజు 6.8 కోట్లు వసూలు చేస్తూ నిలకడగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టింది. ఆదివారం మరో 7 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో తమిళనాడులో 28 కోట్లు వసూలు చేసింది.

     తెలుగులో కలెక్షన్లు ఇలా..

    తెలుగులో కలెక్షన్లు ఇలా..


    తెలుగులో లైఫ్ ఆఫ్ ముత్తుగా రిలీజైన ఈ చిత్రం నైజాం, ఆంధ్రాలో ఓ మోస్తారు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం శనివారం రోజున తెలుగు వెర్షన్‌లో రిలీజైంది. గత రెండు రోజుల్లో 4 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. దాంతో కన్నడ, మలయాళ భాషల్లో కలిపి దక్షిణాదిలో 35 కోట్ల మేరకు వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

     50 కోట్ల క్లబ్‌లో లైఫ్ ఆఫ్ ముత్తు

    50 కోట్ల క్లబ్‌లో లైఫ్ ఆఫ్ ముత్తు


    శింబు నటించిన వేండు థానిందాతు కాడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 50 కోట్ల మైలురాయిని దాటింది. తొలివారం లోపు ఇంకా భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదే ఊపు కొనసాగితే.. ఈ చిత్రం 75 కోట్ల మైలురాయిని దాటే సూచనలు కనిపిస్తున్నాయి.

    English summary
    Simbu's Vendhu Thanindhathu Kaadu movie getting good reports from Trade analysts. Here is the 4 days collections worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X