‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
హైదరాబాద్: మేర్లపాక గాంధీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' చిత్రం పాజిటివ్ టాక్ రావడంతో మంచి ఓపెనింగ్స్ సాధించింది. సందీప్ కిషన్-రాకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫస్ట్ వీకెండ్(3 డేస్) అంచనాలకు మించి అదరగొట్టింది. సందీప్ కిషన్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలుస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సినిమా ప్రోమోలు ఆకట్టుకునే విధంగా ఉండటం, తొలి రోజు పాజిటివ్ టాక్, సినీ విమర్శకుల రివ్యూలు కూడా అనుకూలంగా రావడంతో శుక్రవారం విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో 45 నుంచి 55 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. వారాంతం కావడంతో శని, ఆదివారాల్లో మంచి బిజినెస్ చేసింది.
తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం తొలి వారాంతం ఓవరాల్‌గా రూ. 13.50 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఎగ్జిబిషన్, పబ్లిసిటీ ఖర్చులు పోను నిర్మాతలకు ఎంత మిగిలేది? అనేది తెలియాల్సి ఉంది. శుక్రవారం విడుదలైన ఈచిత్రం తొలి రోజు 3.5 కోట్లు, రెండో రోజు రూ. 4.5 కోట్లు, మూడో రోజు రూ. 5.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే దాదాపుగా ప్రొడక్షన్ కాస్ట్ తిరిగొచ్చిందని సమాచారం.
సినిమా విజయవంతమైన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్మాత జెమిని కిరణ్ ఆదివారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు మేరుపాక గాంధీ, సందీప్ కిషణ్, రాకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మాజీ, రమణ గోగుల, చోటా కె. నాయుడు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే
దర్శకుడు మేరుపాక గాంధీ ఈ చిత్ర కథను ఆసక్తికంగా తయారు చేసుకోవడంతో పాటు కామెడీ అంశాలు మేళవించి వినోదాత్మంగా తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే, డైలాగులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఒక రాత్రిలో జరిగే స్టోరీ
కేవలం ఒక రాత్రిలో జరిగిన సంఘటనలను స్టోరీగా మలిచారు. తిరుపతి వెళ్లాల్సిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కాల్సిన హీరో ట్రైన్ మిస్సై ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనేది చిత్ర కథ. కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే సహించని హీరో వ్యక్తిత్వం కథకు ఎంతో కీలకం.

కామెడీ
ఏవో కామెడీ సీన్లు కావాలని అతికించినట్లు కాకుండా.....సినిమా కథలో కలిసి పోయే విధంగా తెరకెక్కించిన హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

సస్పెన్స్
కథ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగిస్తూ...ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. నేరేషన్లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ సినిమాపై పెద్దగా ఎఫెక్టు చూపలేక పోయాయి.

సందీప్, రాకుల్ కెమిస్ట్రీ
సినిమాలో హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రాకుల్ ప్రీత్ సింగ్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌంట్ అయింది. వీరి మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకు హెలైట్.స


Click it and Unblock the Notifications











