సందీప్‌కిషన్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’రిలీజ్ డేట్ ఖరారు
హైదరాబాద్ : సందీప్‌కిషన్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'. కిరణ్ (జెమిని) నిర్మాత. మేర్లపాక గాంధీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. షూటింగ్ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... 'హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు రైలు ప్రయాణం నేపథ్యంలో జరిగే అందమైన ప్రేమకథ ఇది. ప్రతి సన్నివేశం కొత్తగా వుంటుంది. వినోదానికి పెద్దపీట వేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. రమణగోగుల సంగీతం చిత్రానికి ప్రధానాకర్షణగా వుంటుంది. ఇది పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం. హైదరాబాద్ నుంచి తిరుపతి ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. హీరో హీరోయిన్లుగా సందీప్, రకుల్ చాలా బాగా చేశారు'అన్నారు.

సందీప్ మాట్లాడుతూ "నా కెరీర్‌కు ఇది చాలా ముఖ్యమైన చిత్రం. కథ వినగానే వెంటనే చేయాలనే ఉద్వేగానికి గురయ్యా. సినిమా చాలా బాగా వచ్చింది. నా కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రయాణంలో నేపథ్యంలో జరిగే ఈ ప్రేమకథ తెలుగువూపేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది'' అన్నారు.
సందీప్ నటన, చోటా ఛాయాగ్రహణం హైలైట్ అవుతాయనీ, పాటలు కూడా బాగా వచ్చాయనీ రమణ గోగుల చెప్పారు. ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య ట్రైన్ జర్నీలో కలిగిన అనుభవాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయని రకుల్‌ప్రీత్ తెలిపారు. ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, బ్రహ్మాజీ, నాగినీడు, పృథ్వీ, తాగుబోతు రమేశ్, సప్తగిరి, కమల్, ప్రవీణ్, నిఖిల్, నర్సింగ్ యాదవ్, మీనా, సంధ్య తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, కాసర్ల శ్యామ్, కూర్పు: గౌతంరాజు, కళ: సాహి సురేశ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: మేర్లపాక గాంధీ.


Click it and Unblock the Notifications











