»   » వెంకటేష్ నెక్ట్స్ మూవీ ఆ తమిళ దర్శకుడితో

వెంకటేష్ నెక్ట్స్ మూవీ ఆ తమిళ దర్శకుడితో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన వయసుకు తగిన పాత్రలు ఎంచుకుంటూ....దృశ్యం, గోపాల గోపాల సినిమాలతో వరుస విజయాలు అందుకున్న విక్టరీ వెంకటేష్ నెక్ట్స్ మూవీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ సారి ఆయన ఓ తమిళ దర్శకుడితో పని చేయబోతున్నట్లు చెబుతున్నారు. తమిళ దర్శకుడు ఎన్.వి.నిర్మల్ చెప్పిన స్క్రిప్టు నచ్చడంతో వెంకటేష్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తమిళంలో ‘సలీమ్' అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన ఎన్.వి.నిర్మల్ తొలి సినిమాతోనే మంచి విజయం అందుకున్నారు. విజయ్ ఆంటోనీ-అక్ష జంటగా తెరకెక్కిన ‘సలీమ్' చిత్రం తమిళనాట ఊహించని విజయాన్ని అందుకుంది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రానికి తమిళ ప్రేక్షకులు బాగా ఆదరించారు.

Venkatesh’s next with director NV Nirmal

వెంకటేష్ కూడా ‘సలీమ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేద్దామని అనుకున్నారు కానీ....ఎందుకనో అది సెట్స్ పైకి రాలేదు. అయితే దర్శకుడు ఎన్.వి.నిర్మల్ పై మాత్రం వెంకీ మంచి నమ్మకం ఏర్పడింది. నిర్మల్ ఆసక్తికర మైన స్క్రిప్టుతో రావడంతో వెంకటేష్ అంగీకారం తెలిపినట్లు చెబుతున్నారు. ఏ విషయం అనేది త్వరలోనే అపీషియల్ గా వెల్లడించనున్నారు.

ఇక తమిళ చిత్రం ‘సలీం' తెలుగులో ‘డా. సలీమ్' పేరుతో అనువాదం కాబోతోంది. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా హిట్టయితే తెలుగు ప్రేక్షుకుల్లోనూ నిర్మల్ పై మంచి నమ్మకం ఏర్పడే అవకాశం ఉందని, వెంకీ మూవీకి అది ప్లస్సవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

English summary
Venkatesh may soon be acting in Tamil director NV Nirmal’s direction. Apparently, Venky was highly impressed with the script narrated by Nirmal and gave his nod immediately. Nirmal made his debut with the Tamil thriller ‘Salim’.
Please Wait while comments are loading...