twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు వారాల్లో వెంకీమామ ఫీట్.. వెంకటేష్ ఖాతాలో మరో విజయం

    |

    రియల్ లైఫ్‌ మామా అల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా వెంకీమామ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. డిసెంబర్ 13వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటిరోజే మిశ్రమ స్పందన తెచ్చుకొని చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబడుతోంది. తొలి ఈ వీకెండ్‌లో కుమ్మేసిన వెంకీమామ.. విజయవంతంగా రెండో వారం కూడా పూర్తిచేసింది.

    ఈ వారంతో 'వెంకీమామ' సినిమా బ్రేక్ ఈవెన్ దాటేసింది. వెంకీ మామ సినిమా ఇప్పటివరకు 72 కోట్ల గ్రాస్ 35 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్ర విజయంతో వెంకీ వరసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. గురు సినిమా తర్వాత వరుసగా ఎఫ్ 2, వెంకీమామ సినిమాల రూపంలో సక్సెస్ అందుకున్నాడు వెంకటేష్.

     Venkateshs Venky Mama Got Break Even

    బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన వెంకీమామ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్ గా నటించగా, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలోని కామెడీ ట్రాక్, హీరో హీరోయిన్ల అభినయం, సెకండాఫ్‌లో వచ్చిన ఆర్మీ ఎపిసోడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

    ఇక వెంకటేష్ తన కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ధనుష్ హీరోగా తెరకెక్కి తమళనాట సంచలనం సృష్టించిన 'అసురన్' సినిమాను వెంకటేష్ హీరోగా తెలుగులో రూపొందించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, కళైపులి ఎస్ థాను సంయుక్త సమర్పణలో ఈ సినిమా తెరకెక్కనుంది.

    English summary
    Daggubati Venkatesh and Naga Chaitanya played lead roles in Venky Mama movie. This movie got break even in 2 weeks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X