twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీ మామ 14 రోజుల కలెక్షన్లు: హిట్టా? ఫట్టా? విక్టరీ ఖాతాలో..

    |

    విక్టరీ వెంకటేష్ ఖాతాలో 2019లో మరో భారీ హిట్టు చేరిపోయింది. మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటించిన వెంకీ మామ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. రెండు వారాల్లోనే లాభాల్లోకి చేరిపోయి సెన్సేషనల్ హిట్టుగా మారింది. గత 14 రోజుల్లో వెంకీమామ ఎంత వసూలు చేసిందంటే..

    14వ రోజు కలెక్షన్లు

    14వ రోజు కలెక్షన్లు

    ఏపీ, తెలంగాణలో వెంకీ మామ 14వ రోజున కూడా మంచి లాభాలను సాధించింది. ఈ చిత్రం నైజాంలో రూ.24 లక్షలు, సీడెడ్‌లో రూ.6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.16 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.3 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.2 లక్షలు, గుంటూరులో రూ.3 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.3 లక్షలు, నెల్లూరులో రూ.1 లక్ష వసూలు చేసింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.58 లక్షలు వసూలు చేసింది.

    14 రోజుల్లో వెంకీమామ హవా

    14 రోజుల్లో వెంకీమామ హవా

    తెలుగు రాష్ట్రాల్లో గత 14 రోజుల కలెక్షన్లను చూసుకొంటే.. నైజాంలో రూ.11.16 కోట్లు, సీడెడ్‌లో రూ.4.48 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.4.61 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.2.17 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.34 కోట్లు, గుంటూరులో రూ.2.14 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.68 కోట్లు, నెల్లూరులో రూ.94 లక్షలు వసూలు చేసింది. దాంతో తెలంగాణ, ఏపీలో 28.52 కోట్లు షేర్ సాధించింది.

    ఓవర్సీస్‌ మార్కెట్‌లో

    ఓవర్సీస్‌ మార్కెట్‌లో

    ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో వెంకీ మామ సత్తా చాటింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.2.60 కోట్లు సాధించింది. ఓవర్సీస్‌లో రూ.3.17 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.34.29 కోట్లు షేర్, రూ.58.90 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

    ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రీ రిలీజ్ బిజినెస్

    ఇక ప్రపంచవ్యాప్తంగా వెంకీ మామ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా ఉంది.. నైజాంలో రూ.7.50 కోట్లు, సీడెడ్‌లో రూ.5.40 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.3.60 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.2.40 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.2 కోట్లు, గుంటూరులో రూ.3 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.2.40 కోట్లు, నెల్లూరులో రూ.1.30 కోట్లు మేర బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, మిగితా రాష్ట్రాల రూ.2.70 కోట్లు, ఓవర్సీస్ రూ.2.80 కోట్లు నమోదు చేసింది.

    విక్టరీ ఖాతాలో రెండో హిట్

    విక్టరీ ఖాతాలో రెండో హిట్

    వెంకీ మామ ప్రపంచవ్యాప్తంగా రూ.33.10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. రూ.34 కోట్లు షేర్ సాధిస్తే లాభాల్లోకి రావాల్సి ఉండగా, 14 రోజుల్లో రూ.34.29 కోట్లు రాబట్టడంతో హిట్‌గా నిలిచింది. దాంతో వెంకటేష్ ఖాతాలో ఈ ఏడాది F2తోపాటు వెంకీమామ హిట్‌గా నిలిచింది.

    English summary
    Venky Mama is action comedy film, produced by D. Suresh Babu, T. G. Vishwa Prasad under Suresh Productions & People's Media Factory banners and directed by K. S. Ravindra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X