SAINDHAV Day 1 Collections: సైంధవ్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. తొలి రోజే తక్కువగా.. పెద్ద దెబ్బే ఇది
టాలీవుడ్‌లో ప్రతి హీరోకూ అభిమానులు ఉంటారు. కానీ, అందరు హీరోల అభిమానులు ఆదరించే స్టార్లు మాత్రం ఒకరిద్దరే ఉన్నారు. అలాంటి వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఫ్యామిలీ హీరోగా పేరొందిన ఆయన.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
Recommended Video

ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ బడా హీరో 'సైంధవ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి ఓవరాల్‌గా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో రెస్పాన్స్ కూడా దానికి తగ్గట్లుగానే లభించింది. ఈ నేపథ్యంలో వెంకటేష్ నటించిన 'సైంధవ్' మూవీ మొదటి రోజు వసూళ్లపై ఓ లుక్కేద్దాం పదండి!

సైంధవ్‌గా వచ్చిన వెంకటేష్: శైలేష్ కొలను దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీనే 'సైంధవ్'. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్యలు కీలక పాత్రలను చేయగా.. ఆండ్రియా, రుహానీ శర్మ, శ్రీనిథి హీరోయిన్లుగా నటించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం ఇచ్చారు.

సైంధవ్ మూవీ ప్రీ బిజినెస్: 'సైంధవ్' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 9.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 19.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 4 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 25.00 కోట్లు బిజినెస్ అయింది.

అలాంటి టాక్‌తో డల్‌గానే: సైంటిఫిక్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'సైంధవ్' మూవీ శనివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్‌లోనే అంటే మోస్తరుగానే లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలో వసూళ్లు వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు వెల్లడించారు.

తొలి రోజు ఎంత వచ్చింది?: 'సైంధవ్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే తక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 30 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 25 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో కలిపి.. రూ. 2.38 కోట్లు షేర్, రూ. 4.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ నటించిన 'సైంధవ్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 2.38 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 45 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి రూ. 3.03 కోట్లు షేర్‌తో పాటు రూ. 5.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'సైంధవ్' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 26.00 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు వెంకటేష్ సినిమాకు రూ. 3.03 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 22.97 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











