SAINDHAV Day 11 Collections 26 కోట్ల సినిమా... 11 రోజుల్లో వచ్చిందంతే.. నిర్మాతకు భారీ నష్టాలు!
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ 75వ చిత్రంగా ఇటీవల సైంధవ్ బాక్సాఫీస్ వద్దకు వచ్చింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించగా.. శ్రద్ధా దాస్, రుహానీ శర్మ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో యాక్షన్,ఎమోషనల్ అంశాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇక మొదటి నుంచి ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఫలితంగా కలెక్షన్లు డీలా పడ్డాయి. ఇక బాక్సాఫీస్ వద్ద 11 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే...
వెంకటేష్, శైలష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం సైంధవ్. పాన్ ఇండియా లెవెల్ లో జనవరి 13న సంక్రాంతి పండగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మించగా... వెంకటేష్ సరసన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారయణన్ సంగీతం సమకూర్చారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మిక్స్ డ్ టాక్ రాగా.. ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది.

సైంధవ్ మూవీ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉండగా... బిజినెస్ కూడా బాగానే నమోదు చేసుకుంది. సైంధవ్' మూవీకి నైజాంలో రూ. 7.22 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.01 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 9.11 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 19.28 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.32 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 4.02 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 25.50 కోట్లు బిజినెస్ అయింది.

ప్రస్తుతం సైంధవ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసే పరిస్థితి లేదు. ఇక ఈ సినిమా భారీ నష్టాలను మూట గట్టుకునేలా కనిపిస్తుంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద దారుణమైన వసూళ్లు వస్తున్నాయి. దాదాపు రూ.26 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సైంధవ్ చిత్రం బాక్సాఫీస్ బరిలో దిగగా... ఇప్పటి వరకు ఈ చిత్రం 15 కోట్ల రూపాయలు రాబట్టలేకపోయిందని తెలుస్తోంది.
సైంధవ్ 11 రోజుల కలెక్షన్స్ చూస్తే... నైజాంలో రూ. 3.74 కోట్లు, సీడెడ్ రూ. 1.17 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.29 కోట్లు, ఈస్ట్ రూ 1 కోట్లు, వెస్ట్ రూ. 80 లక్షలు, గుంటూరు రూ.90 లక్షలు, కృష్ణా రూ.0.95 లక్షలు, నెల్లూరు 0.90 లక్షలు, ఏపీ + తెలంగాణ (టోటల్) రూ.8.96 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.0.60 కోట్లు, ఓవర్సీస్ రూ. 1 కోట్లు రాబట్టగా... వరల్డ్ వైడ్( టోటల్) రూ.12 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఇక సైంధవ్ చిత్రం బ్రేక్ 26 కోట్లు కాగా... కేవలం 12 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా గట్టేక్కాలంటే.. 14 కోట్లు వసూలు కావాలి. ఇక ఈ సినిమాతోపాటుగా రిలీజ్ అయిన చిత్రాలు నా సామిరంగా, గుంటూరు కారం, హనుమాన్ లాభాల్లో దూసుకుపోతున్నాయి. వెంకటేష్ కు మాత్రం సైంధవ్ భారీ డిజాస్టర్ అయ్యేలా ఉంది. ఇక నిర్మాతకు భారీ నష్టలు తప్పేలా లేవు.


Click it and Unblock the Notifications











