SAINDHAV Day 3 Collections 'సైంధవ్'కు బాక్సాఫీస్ వద్ద గడ్డు పరిస్థితి.. 3 రోజుల్లో వచ్చిందంతే!
విక్టరీ వెంకటేష్... ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన నటించిన తాజా చిత్రం సైంధవ్. పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. ఫలితంగా సినిమా కలెక్షన్లు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. పండగ సెలవులు ఉన్నప్పటికీ.. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. ఇక బాక్సాఫీస్ వద్ద సైంధవ్ 3 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
శైలేష్ కొలను దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ నటించిన తాజా చిత్రం సైంధవ్. ఇక ఈ మూవీ సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్టుతో తెరకెక్కింది. ఈ మూవీ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్యలు కీలక పాత్రలు పోషించారు. ఆండ్రియా, రుహానీ శర్మ, శ్రీనిథి హీరోయిన్లుగా నటించగా.... సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం సమాకూర్చారు.
Recommended Video


'సైంధవ్' మూవీకి నైజాంలో రూ. 7.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.02 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 9.08 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 19.02 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.02 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 4.12 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 25.02 కోట్లు బిజినెస్ అయింది.
సైంటిఫిక్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'సైంధవ్' మూవీ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోరిలీజ్ అయింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ లభించింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఊహించిన కలెక్షన్లు రావడం లేదు.

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ నటించిన 'సైంధవ్' మూవీ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ 4.98 కోట్ల షేర్ వసూలు చేయగా.. రూ.9.00కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక మూడో రోజు రూ.4 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.00 కోట్ల బిజినెస్ నమోదు చేసుకోగా... బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 26.00 కోట్లుతో బాక్సాఫీస్ బరిలో దిగింది. ఇక ఇప్పట్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కొట్టడం కష్టంగానే కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











