SAINDHAV Day 4 Collections వెంకటేష్ 'సైంధవ్'కు దారుణ కలెక్షన్స్... 4 రోజుల్లో రాబట్టింది ఎంతంటే?
విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం సైంధవ్. సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ లభించింది. ఫలితంగా కలెక్షన్లపై ప్రభావం చూపించింది. సినిమా రిలీజ్ అయి నాలుగు రోజులు అవుతున్నా... అంతగా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. ఇక బాక్సాఫీస్ వద్ద సైంధవ్ 4 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్. ఇక ఈ మూవీ సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందింది. బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్యలు కీలక పాత్రలు పోషించారు. ఆండ్రియా, రుహానీ శర్మ, శ్రీనిథి హీరోయిన్లుగా నటించగా... ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి తెరకెక్కించారు. .... సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

'సైంధవ్' మూవీకి నైజాంలో రూ. 7.12 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.21 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 9.11 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 19.12 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.12 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 4.10 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 25.01 కోట్లు బిజినెస్ అయింది.
సైంటిఫిక్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన వెంటేష్ 'సైంధవ్' చిత్రం జనవరి 13న సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మొదటి ఆట నుంచే ఈ చిత్రానికి అంతటా మిక్స్‌డ్ టాక్ లభించింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా రావడం లేదు. ఇక బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ నటించిన 'సైంధవ్' మూవీ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ 6.60 కోట్ల షేర్ వసూలు చేయగా.. రూ.12 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక నాలుగవ రోజు రూ.2.35 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.00 కోట్ల బిజినెస్ నమోదు చేసుకోగా... బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 26.00 కోట్లుతో బాక్సాఫీస్ బరిలోకి వచ్చింది. ఇక ఇప్పట్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కొట్టడం కష్టంగానే కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











