SAINDHAV Day 5 Collections 'సైంధవ్' గట్టెక్కడం కష్టమే... 5 రోజుల్లో వచ్చిందంతే.. నిర్మాతకు కోట్లలో నష్టం!

విక్టరీ వెంకటేష్ తన కెరియర్లో 75 వ చిత్రం సైంధవ్. సంక్రాంతి కానుకగా జనవరి 13న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయింది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకోగా.. సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. సినిమా రిలీజ్ అయి 5 రోజులు అవుతున్నా... అంతగా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోతుంది. ఇక బాక్సాఫీస్ వద్ద సైంధవ్ 5 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం సైంధవ్. ఇక ఈ మూవీ సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్టుతో తెరకెక్కగా.... బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్యలు కీలక పాత్రల్లో నటించారు. ఆండ్రియా, రుహానీ శర్మ, శ్రీనిథి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి తెరకెక్కించారు.

Recommended Video

Saindhav Collections దారుణంగా వెంకీ మామ సినిమా కలెక్షన్స్.. 5రోజుల్లో వచ్చిందంతే | Telugu Filmibeat

Venkatesh Starrer SAINDHAV Movie Day 5 Worldwide Collections

'సైంధవ్' మూవీకి నైజాంలో రూ. 7.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.11 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 9.12 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 19.11 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.02 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 4.00 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 25.04 కోట్లు బిజినెస్ అయింది.

బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా వచ్చిన తాజా చిత్రం సైంధవ్. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి పండగ హాలిడేస్ అడ్వాంటేజ్ తో రిలీజ్ అయింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం తన జోరుని మాత్రం బాక్సాఫీస్ వద్ద చూపించడం లేదు. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 5వ రోజున దారుణ వసూళ్లను రాబట్టింది.

Venkatesh Starrer SAINDHAV Movie Day 5 Worldwide Collections

నాలుగు రోజుల్లో సైంధవ్ సినిమా నైజాం రూ.2.36 కోట్లు, సీడెడ్ రూ.86 లక్షలు, ఉత్తర ఆంధ్ర రూ.1.05 కోట్లు, తూర్పూ రూ.64 లక్షలు, పశ్చిమ రూ.36 లక్షలు, గుంటూరు రూ.61 లక్షలు,కృష్ణ రూ.59 లక్షలు, నెల్లూరు రూ.26 లక్షలు రాబట్టింది. నాలుగు రోజుల్లో సైంధవ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.6.73 కోట్ల షేర్ (రూ.11.90 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 40లక్షలు వసూలు చేయగా... ఓవర్సీస్ లో మరీ దారణంగా రూ.85 లక్షలే వసూలు చేసింది. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సైంధవ్ సినిమా నాలుగు రోజుల్లో రూ.7.98 కోట్ల షేర్ ( రూ.14.60 కోట్ల గ్రాస్) వసూలు చింది.

ఇక 5వ రోజు కూడా ఈ సినిమా దారుణ వసూళ్లను నమోదు చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగ సినిమాలు ఉండటంతో.. ఈ సినిమాకు మైనస్ గా మారింది. ఈ సంక్రాంతి బరిలో కాకుండా.. ఒంటరిగా వచ్చి ఉంటే ఈ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఇక 5వ రోజు ఈ సినిమా ఇండియాలో రూ.1 కోటి వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా కలిపి రూ.1.50 కోట్లు కూడా రాబట్టలేదని తెలుస్తోంది.

Venkatesh Starrer SAINDHAV Movie Day 5 Worldwide Collections

వెంకటేష్ కెరియర్లో 75వ చిత్రంగా బాక్సాఫీస్ ముందుకు వచ్చిన సైంధవ్ సినిమా 26 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఓవరాల్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 17 కోట్ల షేర్ రాబట్టాలి. ఇది వసూలు అయితేనే సినిమా గట్టెక్కుతుంది. అయితే ఇప్పట్లో సైంధవ్ ఆ రేంజులో వసూళ్లు రాబట్టే ఛాన్స్ లేదని తెలుస్తుంది. మరి నిర్మాతకు భారీ నష్టాలు తప్పవని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X