SAINDHAV 1st Week Collections రూ.25 కోట్ల సినిమా.. వారం రోజుల్లో వచ్చిందంతే.. నిర్మాతకు కోట్లలో నష్టం!
ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఈ సంక్రాంతికి సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వెంకీ కెరియర్లో ఈ సినిమా 75వది. ఇక పాన్ ఇండియా లెవెల్లో సైంధవ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. హిట్ ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేశ్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. యాక్షన్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ డీలా పడిపోయాయి. ఇక వారం రోజులకు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో ఈ స్టోరీలో చూద్దాం.
వెంకటేష్ 75వ చిత్రం సైంధవ్ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమాకి మొదటి నుంచి మిక్స్ డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. తొలి రెండు రోజులు కలెక్షన్లు కూడా బాగానే వసూలు చేసినా.. ఇక గట్టెక్కడం కష్టమే అనిపిస్తుంది.

వెంకటేష్ కెరియర్లో 75వ చిత్రం కావడంతో.. ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుపుకుంది. 'సైంధవ్' మూవీకి నైజాంలో రూ. 7.12 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.31 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 9.13 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 19.32 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.32 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 4.20 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 25.32 కోట్లు బిజినెస్ అయింది.

ప్రస్తుతం సైంధవ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. బ్రేక్ ఈవెన్ కొట్టడం కష్టమే అనిపిస్తుంది. ఈ సినిమాకు దారుణ వసూళ్లు నమోదు అవుతున్నాయి. దాదాపు రూ.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ చిత్రానికి.. కేవలం పది కోట్లవరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. సైంధవ్ సినిమాకు ఆరు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే... కేవలం రూ.9.35 కోట్ల షేర్ రాబట్టగా... రూ.17.15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఇక సైంధవ్ చిత్రానికి 7వ రోజు కూడా దారుణంగా వసూళ్లు వచ్చాయి. 7వ రోజు సైంధవ్ కలెక్షన్స్ చూసుకుంటే... ఇండియాలో ఈ చిత్రానికి కేవలం రూ.26లక్షల రూపాయలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఏడు రోజుల్లో ఈ చిత్రానికి ఇండియాలో రూ.14.03 కోట్ల నెట్ వసూలు కాగా... రూ.17.25 గ్రాస్ వసూలు అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఓవర్సీస్ లో రూ.1.75కోట్లు వసూలు చేసింది. మొత్తం మీద ఈ చిత్రం వసూళ్లు డీలా పడిపోయాయి.

ఇక సైంధవ్ చిత్రానికి పోటీగా సంక్రాంతి బరిలో నాగార్జున నా సామిరంగ, మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్ చిత్రాలు ఉండటం వల్ల ఈ చిత్రానికి మైనస్ అయిపోయింది. ఇక ఈ చిత్రం గట్టేక్కాలంటే.. ఇంక 15కోట్ల షేర్ వసూలు చేయాలి. ఇప్పట్లో ఇంత వసూలు అవ్వడం కష్టమే. ఇక వెంకటేష్ 75వ చిత్రానికి ఈ మేర నష్టాలు రావడం.. ఫ్యాన్స్ కు మింగుడుపడని విషయమే.


Click it and Unblock the Notifications











