SAINDHAV Day 8 Collections బాక్సాఫీస్ వద్ద మహేష్, నాగార్జున, తేజ పాస్... పాపం వెంకటేష్.. కోట్లలో నష్టం!
విక్టరీ వెంకటేష్.. రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పటివరకు ఆయన ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆయన కెరియర్లో 75వ చిత్రంగా సైంధవ్ సినిమా తెరకెక్కింది. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటి వరకు దారుణ కలెక్షన్లను రాబడుతుంది. సైంధవ్ సినిమా 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఫ్యామిలీ హీరో వెంకటేష్ 75వ చిత్రంగా సైంధవ్ పాన్ ఇండియా లెవెల్ లో జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మించారు. వెంకటేష్ సరసన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. సంతోష్ నారయణన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఫలితంగా కలెక్షన్లపై ప్రభావం పడింది.

సైంధవ్ మూవీ విడుదల ముందుకు భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకటేష్ కెరియర్లో 75వ చిత్రంగా రావడం వల్ల బిజినెస్ కూడా బాగానే నమోదు చేసుకుంది. సైంధవ్' మూవీకి నైజాంలో రూ. 7.11 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.11 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 9.12 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 19.38 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.02 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 4.00 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 25.30 కోట్లు బిజినెస్ అయింది.
ప్రస్తుతం సైంధవ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. బ్రేక్ ఈవెన్ కాదు కదా.. భారీ నష్టాలను మూట గట్టుకునేలా కనిపిస్తుంది. ఈ సినిమాకు దారుణ వసూళ్లు వస్తున్నాయి. దాదాపు రూ.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సైంధవ్ చిత్రం బాక్సాఫీస్ బరిలో దిగింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 10 కోట్ల రూపాయలు కూడా రావడం లేదని తెలుస్తోంది.
సైంధవ్ 8 రోజుల కలెక్షన్స్ చూస్తే... నైజాంలో రూ.3.59 కోట్లు, సీడెడ్ రూ.1.10 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.12 కోట్లు, ఈస్ట్ రూ.0.90 కోట్లు, వెస్ట్ రూ. 0.46 కోట్లు, గుంటూరు రూ.0.70 కోట్లు, కృష్ణా రూ.0.75 కోట్లు, నెల్లూరు 0.30 కోట్లు, ఏపీ + తెలంగాణ (టోటల్) రూ.8.88 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.0.60 కోట్లు, ఓవర్సీస్ రూ. 0.90 కోట్లు రాబట్టగా... వరల్డ్ వైడ్( టోటల్) రూ.10 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఇక సైంధవ్ చిత్రం బ్రేక్ 25 కోట్లు కాగా... కేవలం 10 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా గట్టేక్కాలంటే.. 15 కోట్లు వసూలు కావాలి. ఇక ఈ సినిమాతోపాటుగా రిలీజ్ అయిన చిత్రాలు నా సామిరంగా, గుంటూరు కారం, హనుమాన్ లాభాల్లో దూసుకుపోతుంటే... వెంకటేష్ కు మాత్రం భారీ డిజాస్టర్ అయ్యేలా ఉంది. ఇక నిర్మాతకు భారీ నష్టలు తప్పవని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











