SAINDHAV Business: సైంధవ్ మూవీకి షాకింగ్ బిజినెస్.. అన్ని కోట్లు వస్తేనే వెంకటేష్‌కు హిట్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపును తెచ్చుకుని.. సుదీర్ఘ కాలంగా స్టార్‌గా హవాను చూపిస్తున్నారు విక్టరీ దగ్గుబాటి వెంకటేష్. ఆ మధ్య వరుస పెట్టి సినిమాలు చేసిన ఆయన.. కొంత కాలంగా చాలా నెమ్మదిగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. అదే సమయంలో బిగ్గెస్ట్ హిట్ కోసం వేచి చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయన 'సైంధవ్' అనే సైన్స్ ఫిక్సన్ మూవీని చేశారు. విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీ సంక్రాంతికి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసిందో మీరే చూసేయండి!

Recommended Video

Saindhav Business Details అన్ని కోట్లు వస్తేనే Venkatesh కు హిట్ | Telugu Filmibeat

సైంధవ్‌గా రాబోతున్న వెంకీ:శైలేష్ కొలను దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీనే 'సైంధవ్'. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రను చేయగా.. ఆండ్రియా, రుహానీ శర్మ, శ్రీనిథి హీరోయిన్లుగా నటించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

Venkatesh Starrer SAINDHAV Movie Worldwide Pre Release Business Details

అలాంటి స్టోరీతో... థ్రిల్లర్‌గా:విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో వస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రమే 'సైంధవ్'. హీరో తన కూతురి సర్జరీ కోసం ఖరీదైన వాక్సిన్ కావాల్సి రావడం.. దానికోసం తన పాత జీవితంలోకి వెళ్లడం.. అందుకోసం విలన్ గ్యాంగ్‌ను ఎదురించడం అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఫలితంగా ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తీసుకు వస్తున్నారు.

ప్రమోషన్స్ షురూ.. సందడి:వెంకటేష్ హీరోగా నటించిన 'సైంధవ్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లు చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఇక, శుక్రవారం సాయంత్రమే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. దీంతో ఈ మూవీ సందడి ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది.

Venkatesh Starrer SAINDHAV Movie Worldwide Pre Release Business Details

ఏపీ, తెలంగాణలో బిజినెస్:విక్టరీ వెంకటేష్ నటించి 'సైంధవ్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా డీసెంట్‌ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 9.00 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తంగా రూ. 19.00 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్:సరైన హిట్ కోసం చూస్తున్న వెంకటేష్ నటించిన 'సైంధవ్' మూవీకి పోటీ బాగా ఉన్నప్పటికీ బిజినెస్ మాత్రం డీసెంట్‌గానే అయిందని చెప్పాలి. దీంతో ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 4.00 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మొత్తంగా రూ. 25.00 కోట్లు మేర వ్యాపారం అయింది.

Venkatesh Starrer SAINDHAV Movie Worldwide Pre Release Business Details

అన్ని కోట్లు వస్తేనే సక్సెస్:విక్టరీ వెంకటేష్ నటించిన 'సైంధవ్' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఆశించిన దానికంటే ఎక్కువగానే బిజినెస్ జరిగిందని చెప్పుకోవాలి. ఇక, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 25.00 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 26 కోట్లుగా నమోదైంది. అంటే.. ఇంత మొత్తం షేర్‌ను వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్ చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X