twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎఫ్2 11 డేస్ కలెక్షన్స్.. 60 కోట్ల షేర్, గీత గోవిందం రికార్డ్ బ్రేక్ దిశగా!

    |

    విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు కొనసాగిస్తూనే ఉంది. రెండవ వారంలో కూడా ఎఫ్2 చిత్ర జోరు తగ్గడం లేదు. వెంకీ, వరుణ్ తేజ్ కామెడీతో చేసిన రచ్చకు అన్ని వర్గాల ప్రేక్షకులను బ్రహ్మరథం పడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండడంతో వీక్ డేస్ లో కూడా వసూళ్లు తగ్గడం లేదు. కలక్షన్ల పరంగా ఎఫ్2 చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్ర 11 రోజులు వసూళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

     కామెడీతో గిలిగింతలు పెడుతూ

    కామెడీతో గిలిగింతలు పెడుతూ

    విక్టరీ వెంకటేష్ హాస్యం పండించడం లో తిరుగులేని నటుడు. ఆయన నటించిన నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి, చింతకాయల రవి లాంటి చిత్రాలు వెంకీ కామెడీతోనే హిట్ అయ్యాయి. చాలా రోజుల తర్వాత వెంకీ ఎఫ్2 చిత్రంలో చెలరేగిపోయి నటించారు. వెంకీకి వరుణ్ తేజ్ కూడా జత కావడంతో ఎఫ్2 చిత్రం వసూళ్ల సునామి సృష్టిస్తోంది. ట్రేడ్ విశ్లేషకులు కూడా ఉహించని విధంగా ఎఫ్2 చిత్రం బయ్యర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతోంది.

    వెంకీ, వరుణ్, రవితేజ ముగ్గురూ కలసి.. అనిల్ రావిపూడి క్రేజీ ప్లాన్!వెంకీ, వరుణ్, రవితేజ ముగ్గురూ కలసి.. అనిల్ రావిపూడి క్రేజీ ప్లాన్!

     11 డేస్ కలెక్షన్స్

    11 డేస్ కలెక్షన్స్

    తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఎఫ్2 చిత్రం 11 రోజుల్లో 60 కోట్ల షేర్ సాధించింది. తొలి వారంలోనే ఎఫ్2 చిత్రం 50 కోట్ల మార్క్ ని అధికమించడం విశేషం. అన్ని ఏరియాలలో ఎఫ్2 బయ్యర్లు భారీ లాభాలతో పండగ చేసుకుంటున్నారు. ఎఫ్2 చిత్రానికి జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ కేవలం 32 కోట్లు మాత్రమే. అంతే ఎఫ్2 చిత్రం రెండింతల లాభాలని తెచ్చిపెట్టబోతోంది. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ఎఫ్2 ఘనవిజయం సాధించింది.

    రెండు తెలుగు రాష్ట్రాల్లో

    రెండు తెలుగు రాష్ట్రాల్లో

    ఎఫ్ 2 చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 49కోట్లకు పైగా షేర్ రాబట్టింది. నైజాంలో అత్యధికంగా 16.79 కోట్ల షేర్ సాధించడం విశేషం. సీడెడ్ లో 6.35, వైజాగ్ లో 7 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 5 కోట్ల షేర్ తో ఎఫ్2 చిత్రం బలంగా వసూళ్లు రాబడుతోంది. కృష్ణాలో 4 .08 కోట్లతో, గుంటూరులో 4.17 కోట్లతో ఎఫ్2 చిత్రం దూసుకుపోతోంది.

    గీత గోవిందం రికార్డు బ్రేక్ దిశగా

    గీత గోవిందం రికార్డు బ్రేక్ దిశగా

    గత ఏడాది విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్రం సంచలన విజయం సాధించింది. గీత గోవిందం చిత్రం ఫుల్ రన్ లో 70 కోట్ల షేర్ సాధించింది. కాగా ఎఫ్2 చిత్రం మరి కొద్దిరోజుల్లోనే గీతగోవిందం రికార్డుని అధికమించబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. 11 వ రోజు కూడా ఎఫ్2 చిత్రం 2 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఎఫ్2 వసూళ్ల జోరు ఇప్పట్లో ఆగేలా లేదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    English summary
    Venkatesh, Varun Tej F2 movie 11 days box Office collections report
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X