twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఎఫ్2' 20 డేస్ కలెక్షన్స్: అసలు సిసలైన బ్లాక్ బస్టర్.. వెంకీ సత్తాకు నిదర్శనం!

    |

    విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలసి నటించిన మల్టీస్టారర్ ఎఫ్2 ఇప్పటికీ బ్లాక్ బస్టర్ రన్ కొనసాగిస్తోంది. విడుదలై 20 రోజులు గడిచిన ఎఫ్2 చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. దాదాపు చాలా కాలం తర్వాత వెంకటేష్ కామిక్ రోల్ లో చెలరేగిపోయి నటించాడు. వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా చేసిన రచ్చని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్2 చిత్రం నిర్మాతకు, బయ్యర్లకు తిరుగులేని లాభాలని తెచ్చిపెట్టింది. ఎఫ్2 చిత్ర తాజా వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

    వెంకీ సత్తాకు నిదర్శనం

    వెంకీ సత్తాకు నిదర్శనం

    ఇటీవల వెంకటేష్ స్థాయి తగ్గ చిత్రం పడలేదు. కుర్ర హీరోల ఆధిపత్యం పెరుగుతూ సీనియర్ హీరోల జోరు తగ్గుతున్న సమయంలో వెంకటేష్ ఎఫ్2 చిత్రంతో జూలు విదిల్చాడని చెప్పొచ్చు. ఆడియన్స్ తన నుంచి ఏం కోరుకుంటున్నారో అది అందించి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. వెంకటేష్ ఈ తరహాలో కామెడీ పండించడం నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సాయంలోనే జరిగింది.

    20 రోజుల వసూళ్లు

    20 రోజుల వసూళ్లు

    ఎఫ్2 చిత్రం 20 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 74 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఇప్పటికీ స్ట్రాంగ్ గా బాక్సాఫీస్ రన్ కొనసాగిస్తోంది. చిత్ర నిర్మాత దిల్ రాజు, బయ్యర్లు తిరుగులేని లాభాలతో ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎఫ్2 చిత్రం 60 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఓవర్సీస్ లో 8 కోట్లకు పైగా షేర్ సాధించడం విశేషం.

    రెట్టింపు లాభాలు

    రెట్టింపు లాభాలు

    ఎఫ్2 చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 32 కోట్ల వరకు జరిగింది. ఈ చిత్రం 74 కోట్ల షేర్ సాధించడంతో కేవలం లాభాలే 40 కోట్లు దాటేశాయి. దాదాపుగా అన్ని ఏరియాలలో బయ్యర్లు రెట్టింపు లాభాలు అందుకుంటున్నారు. ముఖ్యంగా నైజాం ఏరియాలో 9 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరగగా ఇప్పటికే ఈ చిత్రం 21 కోట్ల షేర్ రాబట్టింది. ఉత్తరాంధ్రలో 9 కోట్లు, గుంటూరులో 5 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఈస్ట్ గోదావరిలో 6 కోట్ల షేర్, సీడెడ్ లో 8 కోట్ల షేర్ రాబట్టింది.

     హీరోయిన్ల గ్లామర్

    హీరోయిన్ల గ్లామర్

    ఎఫ్2 చిత్రం ఈ రేంజ్ లో వసూళ్లు సాధించడానికి హీరోయిన్ల గ్లామర్ కూడా కలసి వచ్చింది. తమన్న, మెహ్రీన్ అందంతో, పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. దేవిశ్రీ అందించిన సంగీతానికి కూడా అద్భుత రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడికి ఇది వరుసగా నాలుగవ సూపర్ హిట్ చిత్రం. అనిల్ రావిపూడి పరాజయం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇటీవల దిల్ రాజు మాట్లాడుతూ ఈ చిత్రానికి సీక్వెల్ ఎఫ్3 ప్రకటించిన సంగతి తెలిసిందే.

    English summary
    Venkatesh, Varun Tej F2 movie 20 days Box office collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X