twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఎఫ్2' 8 డేస్ కలెక్షన్స్.. 50 కోట్లు దాటేసి భీభత్సం!

    |

    విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రన్ ని కొనసాగిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులని నవ్వుల్లో ముంచెత్తుతున్న ఈ చిత్రం కళ్ళు చెదిరే వసూళ్ళని కొల్లగొడుతోంది. తోడల్లుళ్లుగా వెంకటేష్, వరుణ్ తేజ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి రోజులని గుర్తు చేశారు. ఈ చిత్ర 8 రోజుల వసూళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం!

    బాక్సాఫీస్ వద్ద తిరుగులేకుండా

    బాక్సాఫీస్ వద్ద తిరుగులేకుండా

    ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ఎఫ్2 చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రేక్షకులు వెంకీ, వరుణ్ తేజ్ కామెడీకి బ్రహ్మరధం పట్టారు. ఎఫ్2 వసూళ్లు ఈ ఈ చిత్ర బయ్యర్లకు భారీ లాభాలని అందించే దిశగా సాగుతున్నాయి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం అన్ని ఏరియాలలో లాభాలు అందిస్తోంది. వెంకీ, వరుణ్ తేజ్ కు జోడిగా నటించిన తమన్నా, మెహ్రీన్ గ్లామర్ కూడా ఈ చిత్రానికి బాగా కలసి వచ్చింది.

     50 కోట్లు దాటేసి

    50 కోట్లు దాటేసి

    ఎఫ్2 చిత్రం 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 51 కోట్ల షేర్ రాబట్టింది. తొలి వారంలో 43 కోట్ల వరకు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం 8వ రోజు ముగిసే సమయానికి 50 కోట్ల క్లబ్ లో చేరిపోయిందంటే ఈ చిత్రం ఏ స్థాయిలో భీభత్సం సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రానికి జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ 32 కోట్లు. అంటే రెండు రెట్ల వసూళ్ల దిశగా ఈ చిత్రం దూసుకుపోతోంది.

    <strong>ఆయన దెబ్బకు బాక్సాఫీసు అబ్బా.. నిద్ర పట్టడం లేదు, మహేష్ బాబు కూడా: అనిల్ రావిపూడి</strong>ఆయన దెబ్బకు బాక్సాఫీసు అబ్బా.. నిద్ర పట్టడం లేదు, మహేష్ బాబు కూడా: అనిల్ రావిపూడి

     రెండు తెలుగు రాష్ట్రాల్లో

    రెండు తెలుగు రాష్ట్రాల్లో

    రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 8 రోజుల్లో 39.70 కోట్ల షేర్ దక్కింది.నైజాం ఏరియాలో 13.4 కోట్ల షేర్, సీడెడ్ లో 5.22 కోట్లు, ఉత్తరాంధ్రలో 5.55 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 4.74 కోట్లతో ఎఫ్2 చిత్ర వసూళ్లు బలంగా ఉన్నాయి. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా మారిపోయింది. దర్శకుడు అనిల్ రావిపూడికి ఇది వరుసగా నాల్గవ విజయం.

    రెండు మిలియన్ల దిశగా

    రెండు మిలియన్ల దిశగా

    ఇక ఎఫ్2 చిత్రానికి యూఎస్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఓవర్సీస్ లో 8 రోజుల్లో ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్ మార్క్ ని చేరుకుంది. త్వరలోనే 2 మిలియన్లు పూర్తి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. భార్యభర్తల మధ్య వచ్చేగోడవలని అనిల్ రావిపూడి ఈ చిత్రంలో సరదాగా చూపించారు.

    English summary
    Venkatesh, Varun Tej F2 movie 8 days box Office collections report
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X