twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    100 కోట్లు దాటేసిన ఎఫ్2.. సంక్రాంతి అల్లుళ్ళు దుమ్ముదులిపేశారు!

    |

    విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2 బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విధంగా దూసుకుపోతోంది. బ్లాక్ బస్టర్ విజయంగామారిన ఎఫ్2 నిర్మాతకు, బయ్యర్లకు లాభాల పంట పండిస్తోంది. ఫన్ ఎలిమెంట్స్ తో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. వెంకీ, వరుణ్ తేజ్ కు జోడిగా ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ నటించారు. ట్రేడ్ అనలిస్టులని కూడా ఆశ్చర్యపరిచేలా ఎఫ్2 బాక్సాఫీస్ ప్రభంజనం కొనసాగుతోంది.

    తొలి చిత్రం

    తొలి చిత్రం

    2019లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా తొలి టాలీవడ్ చిత్రంగా ఎఫ్2 నిలిచింది. వాస్తవానికి ఎఫ్2 చిత్రం ఈ స్థాయిలో కలెక్షన్ల సునామి సృష్టిస్తుందని చిత్ర యూనిట్ కూడా ఊహించి ఉండరు. ఎఫ్ చిత్రం సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్, ఫన్ లవర్స్ ని ఆకట్టుకునే మంచి చిత్రం అవుతుందని అంతా భావించారు. కానీ ఈస్థాయిలో కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆల్రెడీ ఎఫ్2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల షేర్ దాటేసింది.

    100 కోట్ల గ్రాస్‌తో దూసుకుపోతూ

    తాజాగా ఎఫ్ 2 చిత్రం 100 కోట్ల గ్రాస్ దాటేసింది. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయి మూడవ వారంలోకి ఘనంగా అడుగుపెట్టబోతోంది. మూడవ వారం కూడా ఎఫ్ 2 చిత్రానికి మంచి వసూళ్లు నమోదవుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్ని ప్రాంతాలలో ఎఫ్ 2 చిత్రం డబుల్ ప్రాఫిట్స్ సాధించబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్, వరుణ్ లకు ఇది తొలి 100 కోట్ల చిత్రం.

    కలసి వచ్చిన అంశాలు

    కలసి వచ్చిన అంశాలు

    నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి ఆడియన్స్ ఎలాంటి చిత్రం కోరుకుంటారో అలంటి సినిమా అందించారు. ఇక వెంకీ కామెడీలో చెలరేగిపోయి నటించాడు. వరుణ్ తేజ్ కూడా మంచి నటన కనబరిచాడు. నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాని వెంకీ ఎప్పుడెప్పడు అందిస్తాడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ చిత్రంతో ఆకలి తీరింది. ఇక తమన్నా, మెహ్రీన్ గ్లామర్ కూడా ఈ చిత్రానికి ప్లస్ అయింది.

    వెంకీ, వరుణ్, రవితేజ ముగ్గురూ కలసి.. అనిల్ రావిపూడి క్రేజీ ప్లాన్! వెంకీ, వరుణ్, రవితేజ ముగ్గురూ కలసి.. అనిల్ రావిపూడి క్రేజీ ప్లాన్!

    మూడవ వారంలో కూడా

    మూడవ వారంలో కూడా

    ఎఫ్2 చిత్ర జోరు మూడవ వారంలో కూడా కొనసాగుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నేడు అఖిల్ మిస్టర్ మజ్ను చిత్రం విడుదలవుతోంది. ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విదేయ రామ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాగా నెమ్మదించాయి. దీనితో ఈ వారం బాక్సాఫీస్ వద్ద మిస్టర్ మజ్ను, ఎఫ్2 చిత్రాల ప్రభావమే ఉండబోతోంది.

    English summary
    Venkatesh, Varun Tej F2 movie latest Box office collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X