For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    F3 movie Day 1 collections.. బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్లు.. తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?

    |

    విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ సందేశ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన F3 మూవీ ఊహించినట్టే భారీ కలెక్షన్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లను నమోదు చేసింది. సోషల్ మీడియా, చిత్ర యూనిట్‌ వెల్లడించిన ప్రకారం తొలి రోజు F3 చిత్రం ఎంత వసూలు చేసిందంటే?

    ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

    ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

    తెలుగు రాష్ట్రాల్లో F3 మూవీ విషయానికి వస్తే.. నైజాంలో 18 కోట్లు, ఆంధ్రాలో 25 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 53.8 కోట్ల మేర బిజినెస్ నమోదైంది. కర్ణాటకలో 3.4 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో 1.2 కోట్లు, ఓవర్సీస్‌లో 5.20 కోట్ల బిజినెస్ నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 63.6 కోట్ల బిజినెస్ చేసింది. అలా 64.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

    ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో

    ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో


    F3 చిత్రం ఓవర్సీస్‌లో మంచి వసూళ్లను నమోదు చేసింది. ఆస్ట్రేలియాలో 48 లొకేషన్లలో 81,952 ఆస్ట్రేలియన్ డాలర్లు, న్యూజిలాండ్‌లో 11 లొకేషన్ల నుంచి 8.667 న్యూజిలాండ్ డాలర్లను రాబట్టంది. గత చిత్రాలతో పోల్చుకొంటే ఈ వసూళ్లు మంచి కలెక్షన్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    అమెరికా, యూకేలో

    అమెరికా, యూకేలో


    అలాగే అమెరికాలో కూడా F3 చిత్రం వెంకీ, వరుణ్ తేజ్ క్రేజ్‌, ఇమేజ్‌కు తగినట్టుగానే వసూళ్లను నమోదు చేసింది. అమెరికాలో 500k డాలర్లను తొలి రోజే రాబట్టడం విశేషంగా మారింది. అలాగే యూకేలో కూడా భారీ మంచి కలెక్షన్లు నమోదయ్యాయి. యూకేలో 43 లొకేషన్లలో 85 షోల ద్వారా 5700 టికెట్లకుపైగా అమ్ముడుపోయాయి. తుది కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది.

    నైజాం, ఆంధ్రాలో

    నైజాం, ఆంధ్రాలో

    ఇక F3 చిత్రం నైజాంలో 4.06 కోట్లు వసూలు చేసింది. సీడెడ్‌లో 1.26 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.18 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 16 లక్షల హైర్స్‌తో కలిపి 76 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 55 లక్షల హైర్స్‌తో 94 లక్షలు, గుంటూరు జిల్లాలో 32 లక్షల హైర్స్‌తో 88 లక్షలు, కృష్ణా జిల్లాలో 66 లక్షలు, నెల్లూరు జిల్లాలో 14 లక్షల హైర్స్‌తో 61 లక్షలు రాబట్టింది. దాంతో 1.17 కోట్ల హైర్స్‌తో 17 కోట్ల గ్రాస్, 10 కోట్ల షేర్ సాధించింది.

     ప్రపంచవ్యాప్తంగా F3 కలెక్షన్లు

    ప్రపంచవ్యాప్తంగా F3 కలెక్షన్లు


    F3 చిత్రం కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో కలిపి 85 లక్షలు, ఓవర్సీస్‌లో 2.15 కోట్ల (550k) రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 23 కోట్ల గ్రాస్, 13.35 కోట్ల షేర్‌ను తొలి రోజున నమోదు చేసింది.

     F3 మూవీ లాభాల్లోకి రావాలంటే

    F3 మూవీ లాభాల్లోకి రావాలంటే


    F3 చిత్రం 64.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో కలెక్షన్ల పర్వాన్ని ప్రారంభించింది. తొలి రోజున 13.35 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 51.15 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఈ చిత్రం ఏ మేరకు లాభాలను నమోదు చేస్తుందో వేచి చూడాల్సిందే.

    English summary
    F3 movie day 1 collections worldwide: Venkatesh, Varun Tej's movie rocks at box office
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X