'వెంకీమామ' తొలిరోజు వసూళ్లు.. మామాఅల్లుళ్ళ ప్రభావం ఎలా ఉందో చూడండి
రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'వెంకీమామ' సినిమాతో అలరించారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 13న విడుదలైంది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు వసూళ్లు చూస్తే..

ప్రపంచవ్యాప్తంగా చూస్తే..
అక్కినేని, దగ్గుబాటి అభిమానుల భారీ అంచనాల నడుమ విడుదలైన 'వెంకీమామ' సినిమా ప్రపంచవ్యాప్తంగా సందడి చేసింది. దేశ, విదేశాల్లో చాలా థియేటర్స్‌లో ప్రదర్శించబడిన ఈ సినిమా తొలిరోజే 13.7 కోట్ల మేర రాబట్టిందని ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ఆధారంగా తెలిసింది.

రెండు తెలుగు రాష్ట్రాలు, దేశంలో..
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెంకీమామ బాగానే హంగామా చేశాడు. హిలేరియస్ కామెడీతో ప్రేక్షకలోకాన్ని నవ్వుల్లో ముంచెత్తాడు. ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషన్‌తో ప్రేక్షకులను అలరించారు మామాఅల్లుళ్లు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలు, దేశమంతా కలిపి వెంకీమామ సినిమా 10 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టిందని సమాచారం.

వెంకీమామ ప్రీ రిలీజ్ బిజినెస్
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 'వెంకీమామ' సినిమా 27.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అదే విధంగా కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 2.7 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్‌లో 2.8 కోట్లు, ఇక మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 33.1 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా 34 కోట్ల టార్గెట్‌తో వెంకీమామ బరిలోకి దిగాడు.
Recommended Video

వెంకటేష్ పుట్టినరోజు కానుక
బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన 'వెంకీమామ' సినిమాను వెంకటేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న విడుదల చేశారు. చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటించగా, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటించింది. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కట్టిన ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్ పుష్కలంగా ఉందని టాక్ బయటకొచ్చింది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ మామాఅల్లుళ్ళ వసూళ్లు ఎలా ఉంటాయో!.


Click it and Unblock the Notifications











