'వెంకీమామ' హంగామా.. ఫస్ట్ డే కలెక్షన్స్ డీటెయిల్ రిపోర్ట్
వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ సినిమా 'వెంకీమామ'. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటించగా, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటించింది. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కట్టారు. డిసెంబర్ 13వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటిరోజే మిశ్రమ స్పందన తెచ్చుకొని చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టింది.
తొలిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వెంకీమామ సినిమా 6.76 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. దీనికి కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా వసూళ్లు కలుపుకుంటే ఈ సినిమాకు 7.40 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. మొదటి రోజు వసూళ్ల పరంగా చూస్తే.. అటు వెంకీ కెరీర్ లోనూ ఇటు చైతు కెరీర్ లోనూ ఇదే హయ్యెస్ట్ కావడం విశేషం.

ఇక ప్రాంతాల వారీగా చూస్తే.. నైజాంలో 2.37 కోట్లు, సీడెడ్ 1.60 కోట్లు, నెల్లూరులో 0.27 కోట్లు, గుంటూరులో 0.37 కోట్లు, వెస్ట్ గోదావరి 0.30 కోట్లు, ఈస్ట్ గోదావరి 0.60 కోట్లు, కృష్ణ: 0.37 కోట్లు, ఉత్తరాంధ్ర 0.88 కోట్లు, ఏపీ మరియు తెలంగాణా టోటల్ గా 6.76 కోట్లు రాబట్టింది వెంకీమామ మూవీ.
మరోవైపు కర్ణాటకలో 0.40 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియాలో 0.24 కోట్లు, టోటల్ ఇండియాలో 7.40 కోట్లు రాబట్టింది వెంకీమామ. ఈ రిపోర్ట్ ప్రకారంగా, ప్రస్తుత డిమాండ్ చూస్తే ఈ సినిమా రానున్న రోజుల్లో మంచి వసూళ్లు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











