Venky Mama Box Office Collections : వెంకీమామ క్లోజింగ్ కలెక్షన్లు.. ఎంత లాభం వచ్చిందంటే..?
విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య ఇద్దరూ కలిసి నటించడం, రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌నే రీల్ లైఫ్‌లోనూ పోషించడంతో అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. వీటికి తోడు పాటలు, టీజర్, ట్రైలర్, పోస్టర్స్ ఇలా ప్రతీ ఒక్కటి సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. డిసెంబర్ 20న రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతి సీజన్ మొదలయ్యే వరకు థియేటర్లలో పాగా వేసింది.

పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన వెంకీమామ..
మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వెంకీమామ కలెక్షన్లలో దూసుకుపోయింది. వెంకీ కామెడీ టైమింగ్, మాస్ అండ్ క్లాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న వెంకీమామ సూపర్ హిట్ టాక్‌తో రికార్డు కలెక్షన్లను నమోదు చేసింది. తాజాగా ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్ల రిపోర్ట్ వచ్చింది. ఆ లెక్కలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

ఎంత బిజినెస్ చేసిందంటే..
నైజాం 7.50కోట్లు, సీడెడ్ 5.40కోట్లు, ఉత్తరాంధ్ర 3.60కోట్లు, ఈస్ట్ 2.40కోట్లు, వెస్ట్ 2కోట్లు, గుంటూరు 3కోట్లు, కృష్ణా 2.40కోట్లు, నెల్లూరు 1.30కోట్లు, రెస్టాప్ ఇండియా కర్ణాటక కలిపి 2.70కోట్లు, ఓవర్సీస్‌లో 2.80 మొత్తంగా 33.10కోట్ల మేర బిజినెస్ చేసింది.

ఏరియాలా వారిగా..
వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్ అనగానే వచ్చిన పాజిటివ్ వైబ్స్.. కలెక్షన్లలోనూ కనిపించింది. ఈ చిత్రం నైజాంలో 12.94కోట్లు, సీడెడ్‌లో 4.99కోట్లు, ఉత్తరాంధ్రలో 5.60కోట్లు, ఈస్ట్ 2.51కోట్లు, వెస్ట్ 1.53కోట్లు, గుంటూరు 2.46కోట్లు, కృష్ణా 1.99కోట్లు, నెల్లూరు 1.08కోట్లు కొల్లగొట్టింది.
Recommended Video

మొత్తంగా ఎంత అంటే..
ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 32.66కోట్ల షేర్‌ను రాబట్టగా.. ప్రపంచ వ్యాప్తంగా 39.04కోట్ల షేర్ రాబట్టింది. ఇదే గ్రాస్ రూపంలో అయితే మొత్తంగా 69.10కోట్లు రాబట్టింది. మొత్తంగా 5.10కోట్లు లాభం తెచ్చిపెట్టి సూపర్ హిట్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications











