మన్మథుడు2కి రికార్డు బిజినెస్.. వెన్నెల కిషోర్ సెన్సేషనల్ ట్వీట్
2002లో మన్మథుడు సినిమాను దర్శకుడు విజయ్ భాస్కర్ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సమయంలో మాటల గారడీ చేశారు. సొనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు స్వీక్వెల్‌గా రూపొందిన మన్మథుడు 2 చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ చిత్రంలో కోడలు సమంత, మరో హీరోయిన్ కీర్తి సురేష్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానున్నది.

కాగా, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్టు వినిపిస్తుంది. అందుకు బలం చేకూరే విధంగా కమెడియన్ వెన్నెల కిషోర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మన్మథుడు 2 సినిమాకు సంబంధించిన సూపర్ హ్యాపీ న్యూస్ చెబుతాను. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.8.4 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా హీరో నాగార్జున, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కు నా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
నటీనటులు: అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని
స్క్రీన్ ప్లే : రాహుల్ రవీంద్రన్, సత్యానంద్,
డైలాగ్స్ : కిట్టు విస్సప్రగడ, రాహుల్ రవీంద్రన్,
ఎడిటర్స్ : చోట వి ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్స్: ఎస్. రామకృష్ణ, మోనికా నీగోత్రే సబ్బని,
కాస్ట్యూమ్స్ : అనిరుధ్ సింగ్, దీపికా లల్వాని,
డి.ఓ.పి : ఎం.సుకుమార్,
సంగీతం : చైతన్ భరద్వాజ్
నిర్మాతలు : అక్కినేని నాగార్జున, పి.కిరణ్
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్


Click it and Unblock the Notifications











