5 రోజుల్లో 2050 కోట్ల రూపాయలు కలెక్షన్లు.. చైనాలో బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తున్న మూవీ ఏంటో తెలుసా?

హాలీవుడ్‌ థ్రిల్లర్ మూవీ వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను రాబడుతున్నది. కెళ్లీ మెర్సల్ రచన, దర్శకత్వ బాధ్యతలు చేపట్టి రూపొందించిన ఈ సినిమాకు హీరో, నిర్మాత టామ్ హార్డీ రచనా సహకారం అందించారు. హర్డీతోపాటు కెళ్లీ మెర్సల్, ఆమీ పాస్కల్, మాట్ టోల్ మాచ్, అవి అరాద్ తదితరులు ఈ సినిమాను నిర్మించారు. గత 6 రోజుల్లో ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టిందంటే?

మార్వెల్ కామిక్‌లో కనిపించే వెనోమ్ పాత్రను ఆధారంగా చూసుకొని రూపొందించిన అమెరికన్ సూపర్ హీరో ఫిలిం వెనోమ్: ది లాస్ట్ డ్యాన్స్. ఈ సినిమాలో టామ్ హార్డీ, చివెటెల్ జోఫర్, రైస్ ఇఫాన్స్, స్టీఫెన్ గ్రాహం, పెగ్గీ లూ, క్లార్క్ బాకో తదితరులు నటించారు. కొలంబియా ఫిక్చర్స్, మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 25వ తేదీన రిలీజైంది.

Venom The Last Dance 6 days Box Office Collections Worldwide

ఇండియాలో ఈ మూవీ భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. పెయిడ్ ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా 4.6 కోట్ల రూపాయలు, తొలి రోజు 4.6 కోట్ల రూపాయలు, రెండో రోజు 7 కోట్ల రూపాయలు, మూడో రోజు 8 కోట్ల రూపాయలు, 4వ రోజు 10.5 కోట్ల రూపాయలు, 5వ రోజు 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక 6వ రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం ఇండియాలో సుమారుగా 35 కోట్లు నికరంగా.. 50 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇదే జోష్ కొనసాగితే 50 కోట్ల రూపాయల నికర కలెక్షన్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ చిత్రం నార్త్ అమెరికాలో భారీగా వసూళ్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా 55 మిలియన్లు అంటే సుమారుగా సుమారుగా 500 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ మూవీ 124 మిలియన్లు అంటే సుమారుగా 1100 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు చేరువైందని తెలిపారు.

Venom The Last Dance 6 days Box Office Collections Worldwide

చైనాలో వెనమ్ చిత్రం భారీగా వసూళ్లను రాబడుతున్నది. 2018 సంవత్సరంలో రిలీజైన వెనమ్ 1 మూవీ 860 మిలియన్ డాలర్లు అంటే 7230 కోట్ల ర ూపాయలు, 2021 సంవత్సరంలో రిలీజైన వెనమ్ 2 చిత్రం 5060 మిలియన్ డాలర్లు అంటే 427 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వెనమ్ 3 చిత్రం కేవలం 5రోజుల్లో 46 మిలియన్ డాలర్లు అంటే.. 386 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అమెరికాలో 500 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 1100 కోట్ల రూపాయలు, చైనాలో 386 కోట్ల రూపాయలు, ఇండియాలో 50 కోట్ల రూపాయలు సూలు చేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 2050 కోట్ల రూపాయలు రాబట్టింది. రానున్న రోజుల్లో ఈ చిత్రం ఏ రేంజ్ కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X