Venom: The Last Dance Collections: 1000 కోట్ల టార్గెట్.. వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
హాలీవుడ్‌లో అత్యంత ఆదరణ ఉన్న సీక్వెల్ వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ చిత్రం తాజాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. కెళ్లీ మెర్సల్ రచన, దర్శకత్వ బాధ్యతలు చేపట్టి రూపొందించిన ఈ సినిమాకు హీరో, నిర్మాత టామ్ హార్డీ రచనా సహకారం అందించడం విశేషంగా మారింది. ఈ సినిమాను హర్డీతోపాటు కెళ్లీ మెర్సల్, ఆమీ పాస్కల్, మాట్ టోల్ మాచ్, అవి అరాద్ తదితరులు నిర్మించారు. ఇటీవల రిలీజై ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
మార్వెల్ కామిక్‌లో కనిపించే వెనోమ్ పాత్రను ఆధారంగా చూసుకొని రూపొందించిన అమెరికన్ సూపర్ హీరో ఫిలిం వెనోమ్: ది లాస్ట్ డ్యాన్స్. ఈ సినిమాలో టామ్ హార్డీ, చివెటెల్ జోఫర్, రైస్ ఇఫాన్స్, స్టీఫెన్ గ్రాహం, పెగ్గీ లూ, క్లార్క్ బాకో తదితరులు నటించారు. కొలంబియా ఫిక్చర్స్, మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 25వ తేదీన రిలీజైంది.

ఈ సినిమాకు భారీగా వీఎఫ్ఎక్స్ అవసరం కావడం, భారీగాసెట్స్ వేయాల్సి రావడంతో నిర్మాణ వ్యయం భారీగానే అయింది. ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 1000 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా 1000 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బాక్సాఫీస్ బరిలోకి దిగింది.
ఈ మూవీపై భారీగా అంచనాలు ఉండటంతో ప్రీమియర్లను ప్రదర్శించారు. ఇండియాలో ప్రదర్శించిన ఈ సినిమా స్పెషల్ షోకు మంచి స్పందన లభించింది. పెయిడ్ ప్రీమియర్ల ద్వారా 5.5 కోట్ల గ్రాస్, 4.6 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. ఇండియాలో తొలి రోజు 6.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో తొలి రోజు ఈ మూవీ 11.7 కోట్లు వసూలు చేసింది.

ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. ఇంగ్లీష్ వెర్షన్ సుమారుగా 2.25 కోట్లు, హిందీ 1.75 కోట్లు, తమిళంలో 50 లక్షలు, తెలుగులో 40 లక్షల వసూళ్లను సాధించింది. ఇటీవల కాలంలో మరే చిత్రం సాధించిన విధంగా ఈ మూవీ భారీగా వసూళ్లు సాధించింది.
వెనమ్ మూవీ రెండో రోజు కూడా భారీగా వసూళ్లను సాధించింది. ఇండియాలో ఈ చిత్రం 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 18 కోట్ల రూపాయలు రాబట్టింది.
వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ చిత్రం వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఓవర్సీస్‌లో 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అమెరికాలో ఈ సినిమా మరో 50 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తొలి రోజు 100 కోట్లు కలెక్ట్ చేసింది. తొలి వారాంతానికి ఈ మూవీ 115 మిలియన్ డాలర్లు అంటే 180 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











