Vettaiyan Day 1 Collection: బాక్సాఫీస్ వద్ద రజనీ సినిమా రచ్చ రంబోలా.. 1 వ రోజు వేట్టయాన్ కు ఎన్ని కోట్లంటే?
Vettaiyan Day 1 Collection: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)'వేట్టయాన్'(Vettaiyan)గురువారం (అక్టోబర్ 10న) భారీ అంచనాలతో
ప్రపంచవ్యాప్తంగా థియేటర్ ల్లో విడుదలైంది. జై భీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ కాప్ డ్రామాలో రజనీకాంత్ హీరోలో నటించగా.. బాలీవుడ్ బీ బిగ్ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. కాగా, పాన్ ఇండియా లెవల్ లో రూపుదిద్దుకున్న ఈ మూవీ వర్డల్ వైడ్ గా విడుదల పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. వెట్టయన్ తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఓ లూక్కేయండి.
సూపర్ స్టార్ రజినీకాంత్ 170వ సినిమా వేట్టయాన్ ది హంటర్ (Vettaiyan). ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేయడానికి వచ్చింది. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం ల్లో విడుదలైంది. గతేడాది వచ్చిన రజనీకాంత్ జైలర్(Jailer) సినిమాతో పోల్చితే.. ఈ సినిమాకు అంత బజ్ క్రియేట్ కాలేదనే చెప్పాలి. అయినా.. ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది వేట్టయాన్.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించిన ఈ మూవీలో దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్ర సంగీతం మరో లెవల్. బీజీఎం ఇరగదీశారనే చెప్పాలి. అలాగే.. వేట్టయాన్ సినిమా విడుదలకు ముందే.. వచ్చిన టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇలా ఈ అంశాలు ఈ మూవీ ఫ్లస్ పాయింట్స్ అని చెప్పాలి.
ఇక వేట్టయాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాల్లోకెళ్తే.. రజినీకాంత్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'వేట్టయాన్' తెలుగు తో పాటు పలు భాషలతో పాటు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యింది. కానీ.. రజనీకాంత్ లాస్ట్ మూవీ జైలర్ లాగా తెలుగు ప్రమోషన్స్ పెద్దగా జరగలేదు. అంతేకాకుండా.. తెలుగు ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేలా తెలుగు టైటిల్ కూడా పెట్టలేదు. దీంతో తెలుగు మూవీ కాదనే భావన వచ్చింది. ఈ ప్రభావం మూవీ అడ్వాన్స్ బుకింగ్ పడింది. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా పడిపోయాయి.ఈ సినిమా తొలి షోతోనే యావరేజ్ టాక్ ను అందుకుంది. అయినా.. వేట్టయాన్ కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి.

మూవీ మార్కెటింగ్ విశ్లేషకుల ప్రకారం.. మెయిన్ గా తమిళనాడులో వేట్టయాన్ ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. తమిళ్ లో తొలి రోజు సినిమా రూ. 20 నుంచి రూ. 22 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్నట్టు. ఇక కర్ణాటక 8 కోట్లు, కేరళ 3 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక తెలుగులో మొదటి రోజు రూ. 3.5 నుంచి 4 కోట్ల కలెక్షన్స్ అందుకున్నటు తెలుస్తోంది.
ఇక ఓవర్సీస్ లో 3.2 నుంచి 3.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుంది. అంటే.. ఓవర్సీస్ లో వెట్టయన్ మూవీ తొలిరోజు రూ. 25 -26 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకున్నట్టు సమాచారం. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 62 కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు రాబట్టింది. ఈ కలెక్షన్లతో మూవీకి పెట్టిన బడ్జెట్ లో సగం వరకు రాబట్టిందని తెలుస్తోంది. తొలి రోజే.. ఈ రేంజ్ లో వసూల్ చెయ్యడంతో రజినీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.


Click it and Unblock the Notifications











