Vettaiyan Day 15 Collection: తగ్గిన రజనికాంత్ మూవీ కలెక్షన్లు.. 15 వ రోజు వేట్టయాన్ కు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Vettaiyan Day 15 Collections: లెజెండరీ నటులు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'వెట్టియన్'. ఈ మల్టీ స్టారర్ మూవీ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ అంచాలతో విడుదల అయిన విషయం తెలిసిందే. జై భీమ్ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ కాంబోలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ వేట్టయాన్ యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా.. కలెక్షన్ల పరంగా మాత్రం బెటరే అనిపిస్తోంది. ఇంతకీ వేట్టయాన్ మూవీ విడుదలైన 15 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో ? వేట్టయాన్ మూవీ రోజు వారీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లతో పాటు మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి తదితరులు లీడ్ రోల్స్ లో నటించారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ మల్లీ స్టార్స్ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లి రాజా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ యాక్షన్ మూవీ కోసం దాదాపు 300 కోట్లు వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.

ఇక రజనీకాంత్ వేట్టయాన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. వేట్టయాన్ విడుదలైన మొదటి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.31.7 కోట్లు వసూళు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.68.4 కోట్లు కలెక్ట్ చేసింది. వేట్టయాన్ రెండవ రోజు రూ.24 కోట్లు, మూడో రోజు రూ.26.75 కోట్లు, నాలుగో రోజు రూ. 22.30 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా (మొదటి నాలుగు)రోజుల్లో వేట్టయాన్ రూ.240 కోట్లు కలెక్ట్ చేసినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.
ఇక 5 రోజు బాక్సాఫీస్ వద్ద వేట్టాయన్ కేవలం రూ.5.60 కోట్లు రాబట్టింది. ఇక 6వ రోజు రూ.4.30 కోట్లు, 7వ రోజు రూ.4.5 కోట్లు, 8వ రోజు రూ.3.15 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా మొదటి వారం రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ 122.15 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక తొమ్మిదో రోజు అత్యల్పంగా రూ. 2.6 కోట్లు మాత్రమే వసూళ్లు చేసింది వేట్టయాన్. కానీ, రెండవ వీకెండ్ లో రజినీ వేట్టయన్ మూవీ కలెక్షన్లు కాస్త పెరిగాయి. పదవరోజు రూ. 4.25 కోట్లు కలెక్ట్ చేయగా..11 వ రోజు రూ. 5.35 కోట్లు రాబట్టింది. గత మూడు రోజులుగా ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ చూస్తే.. 12వ రోజు 1.95 కోట్లు, 13వ రోజు 1.80 కోట్లు, 14వ రోజు 1.65 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

15వ రోజు వేట్టయాన్ కలెక్షన్ల వివరాలకు వస్తే..రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ సినిమా 'వెట్టయన్' విడుదలై 15 రోజులు పూర్తి చేసుకున్న బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతునే ఉంది. సక్‌నిల్క్ (Sacnilk) నివేదిక ప్రకారం 15వ రోజున వేట్టయాన్ మూవీ రూ. 1.50 కోట్లు రాబట్టింది. ఇది భారతదేశంలోని అన్ని భాషలలో మొత్తం ఆదాయాన్ని రూ. 141.50 కోట్లుగా అంచనా వేసింది.
ఆక్యుపెన్సీ పరంగా చూసుకుంటే.. తమిళ ఆక్యుపెన్సీ రేటు 15.95%, తెలుగు ఆక్యుపెన్సీ 12.70%, హిందీ ఆక్యుపెన్సీ 6.33% గా నమోదైంది. అక్టోబర్ 23, 2024 నాటికి.. వేట్టయాన్ మూవీ భారతదేశంలో సుమారుగా రూ. 141.50 కోట్లు వసూలు చేసింది. అలాగే.. ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 245 కోట్ల పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. కానీ, రోజు వారి కలెక్షన్ల పరంగా చూస్తూ.. రజనీకాంత్ మూవీ వసుళ్లు ఘోరంగా పడిపోయాయి.


Click it and Unblock the Notifications











