Vettaiyan Day 2 Collection: రజనీ మాస్ కుమ్ముడు.. 2వ రోజు వేట్టయాన్ కు ఎన్ని కోట్లంటే?
Vettaiyan Day 2 Collection: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ 'వేట్టయాన్'(Vettaiyan) గురువారం (అక్టోబర్ 10న) భారీ అంచనాలతో విడుదలైంది. డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా మూవీలో రజనీకాంత్ హీరోలో నటించగా.. బాలీవుడ్ బీ బిగ్ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దికున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై.. మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. వేట్టయాన్ మూవీ రెండోవ రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఓ లూక్కేయండి.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 170వ సినిమా వేట్టయాన్ ది హంటర్ (Vettaiyan). దసరా కానుకగా ప్రేక్షకులకు వచ్చింది. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల అయ్యింది. గతేడాది విడుదలైన రజనీకాంత్ జైలర్(Jailer) మూవీతో పోల్చితే.. ఈ మూవీకి కావాల్సినంత బజ్ మాత్రం క్రియేట్ కాలేదు. అలాగే.. తెలుగులో కూడా అంతగా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టలేదు. అయినా.. ఫస్ట్ షో నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నా.. కలెక్షన్ల పరంగా రజినీ మార్క్ చూపిస్తోంది.

భారీ బడ్జెట్ మూవీ మేకర్స్ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ మూవీని సుభాస్కరన్ అల్లి రాజా నిర్మించారు. ఈ యాక్షన్ మూవీలో దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఒక్కే స్కీన్ పై కనిపించారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్ర సంగీతం మరో లెవల్. బీజీఎం ఇరగదీశారనే చెప్పాలి. అలాగే.. వేట్టయాన్ సినిమా టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీలో మెయిన్ గా ప్రధానంగా రజినీకాంత్ మ్యానరిజం ఓ లెవల్‌లో ఉందని చెప్పాలి. ఆయన మాస్ లూక్ లో ఆకట్టుకోవడంతో ఫ్యాన్స్ ఫీలింగ్ వేరే లెవల్ ఉంది.
కలెక్షన్ల పరంగా చూస్తే.. వేట్టయాన్ ఫస్ట్ డే కలెక్షన్లు రికార్డు క్రియేట్ చేస్తోంది. ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో విడుదలైన మూవీలో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన మూవీగా జాబితాలో సెకండ్ ఫ్లేస్ దక్కించకుంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 68.4 కోట్ల(గ్రాస్)వసూలు చేసింది. ఇదే ఏడాది కోలీవుడ్‌లో విడుదలైన విజయ్ 'ది గోట్' అత్యధిక రూ.120 కోట్లు కలెక్షన్లు రాబట్టి.. ఈ జాబితాలో టాప్ ఫ్లేస్ లో నిలిచింది. అయితే ఈ సినిమా టైటిల్‌ను తెలుగులో మార్చకుండానే 'వేట్టయాన్' పేరుతో విడుదల చేశారు. దీంతో కలెక్షన్లపై కాస్త ఎఫెక్ట్ పడినట్టు టాక్.
'వేట్టయాన్' మూవీ తొలి రోజు ( డే 1) వివిధ ప్రాంతాల్లో కలెక్షన్లు చూస్తే.. పాన్ ఇండియా వైడ్ గా రూ. 30 కోట్లు (నెట్) లేదా రూ. 36 కోట్ల (గ్రాస్) కలెక్ట్ చేసింది. ఇందులో తమిళనాడుతో తొలి రోజు రూ.25.65 కోట్లు వసూళ్లు చేయగా.. ఇక కర్ణాటక 8 కోట్లు, కేరళ 4 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో విషయానికి వస్తే.. రూ. 5.20 కోట్ల వసూలు చేసింది. ఇందులో నిజాం కలెక్షన్లు రూ. 1.05 కోట్లు, సీడెడ్ లో రూ. 50 లక్షలు, ఆంధ్రలో రూ. 1.15 కోట్లు చేసింది. ఓవరాల్ గా రూ. 5.20 కోట్లు చేసింది. ఇదెలా ఉంటే.. హిందీ ఓపెనింగ్ మాత్రం దారుణంగా ఉన్నాయి. కేవలం రూ. 60 లక్షలు మాత్రం వసూలు చేయడం అందర్నీ షాక్ గురి చేస్తుంది. ఇక ఓవర్సీస్ లో రూ. 32.40కోట్లు వసూళు చేసినట్టు సమాచారం. ఇలా ప్రపంచవ్యాప్తంగా 68.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఇక వేట్టయాన్ డే 2 కలెక్షన్లు (Vettaiyan Day 2 Collections) పరిశీలిస్తే.. తొలి రోజు యావరేజ్ టాక్ సొంతం చేసుకోవడంతో రెండవ రోజు కలెక్షన్ల పై ప్రభావం పడింది. వేట్టైయాన్ కలెక్షన్లకు ఫిల్లర్ లాంటి తమిళనాడుతో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త పడిపోయాయి. ఇక తమిళనాడులో 57.33% ఆక్యుపెన్సీతో రూ 13.31 కోట్లు వసూలు చేయగా.. కర్ణాటక లో 43.83% ఆక్యూపెన్సీతో రూ. 2.5 కోట్లు , కేరళ లో 35.19% ఆక్యూపెన్సీ తో రూ 2.25 కోట్లు, తెలంగాణలో 27.11% ఆక్యూపెన్సీతో రూ. 0.99 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో 30.15 % ఆక్యూపెన్సీతో రూ 0.91 కోట్లు వసూలు చేసింది.
ఇక హిందీ బెల్డ్ లో కేవలం 32 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇక ఓవరల్ ఇండియా వైడ్ గా చూస్తే.. సగటున 44.35 % ఆక్యుపెన్సీతో టోటల్ ఇండియా వైడ్ గా రూ. 20.49 కోట్లు (నెట్) కలెక్ట్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రెండవ రోజు వేట్టయాన్ దాదాపు 36 కోట్లు (గ్రాస్)వసూలు చేసింది. ఈ వసూళ్లతో వేట్టయాన్ రూ. కోట్ల మార్క్ చేరువైంది.


Click it and Unblock the Notifications











