Vettaiyan Day 2 Collection: రజనీ మేనియా వర్కవుట్ అయ్యేనా ? 2 వ రోజు వేట్టయాన్ కు ఎన్ని కోట్లంటే?

Vettaiyan Day 2 Expected Collections: సూపర్ స్టార్ రజనీకాంత్- జై భీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ కాంబో తెరకెక్కిన చిత్రం 'వేట్టయాన్' (Vettaiyan). ఈ భారీ బడ్జెట్ మూవీ గురువారం (అక్టోబర్ 10న) భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. థ్రిల్లర్ కాప్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించారు. కాగా, ఫస్ట్ షో నుంచి యావరేజ్ టాక్ తో నడుస్తోంది. కానీ, కలెక్షన్ల పరంగా మాత్రం పాజివిట్ రిజల్స్ ఉంది. వేట్టయాన్ మూవీ రెండో రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేయబోతుందో ఓ లూక్కేయండి.

రజినీకాంత్ 170వ సినిమా వేట్టయాన్ ది హంటర్ (Vettaiyan)లో దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ఈ మూవీలో ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్, రోహిణి, రావు రమేష్, అభిరామి, రమేష్ తిలక్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం ల్లో విడుదలైంది.

Vettaiyan Day 2 Expected Box Office Collections Worldwide Rajinikanth Vettaiyan movie collections drop

కాగా..గతేడాది వచ్చిన రజనీకాంత్ జైలర్(Jailer) సినిమాతో పోల్చితే.. ఈ సినిమాకు అంత బజ్ క్రియేట్ కాలేదనే చెప్పాలి. కానీ, పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది వేట్టయాన్. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్ర మాస్ మ్యూజిక్ అందించారు. బీజీఎం ఓ రెంజ్ లో ఇచ్చిపడేశాడు. ఈ మూవీ విడుదలకు ముందే.. రిలీజ్ అయినా టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్ చేశాయి. ఈ మూవీలో ప్రధానంగా రజినీకాంత్ మ్యానరిజం ఓ లెవల్‌లో ఉంది. ఆయన స్టైల్ ఆకట్టుకోవడంతో ఫ్యాన్స్‌ ఓ రేంజ్ లో ఖుషీ అవుతున్నారు.

వేట్టయాన్ ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది కోలీవుడ్ లో విడుదలైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో రెండో స్థానంలో దక్కించకుంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.65 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు సమాచారం. అయితే ఇదే ఏడాది కోలీవుడ్‌లో విడుదలైన విజయ్ 'ది గోట్' అత్యధిక రూ.120 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ఈ జాబితాలో తొలిస్థానంలో నిలవగా..'వేట్టయాన్' తరువాత స్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమా టైటిల్‌ను తెలుగులో మార్చకుండానే 'వేట్టయాన్' పేరుతో విడుదల చేశారు. దీంతో కలెక్షన్లపై కాస్త ఎఫెక్ట్ పడినట్టు టాక్.

'వేట్టయాన్' మూవీ వివిధ ప్రాంతాల్లో కలెక్షన్ల పరంగా చూస్తే.. తమిళనాడులో వేట్టయాన్ తొలి రోజు భారీ కలెక్షన్ల అందుకుంది. తమిళనాడులో తొలి రోజు రూ.25.65 కోట్లు వసూళ్లు చేయగా.. ఇక కర్ణాటక 8 కోట్లు, కేరళ 3 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 4 కోట్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో 3.2 నుంచి 3.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుంది. అంటే.. దాదాపు 32.40కోట్లు వసూళు చేసినట్టు సమాచారం. ఇలా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 65 కోట్ల పైగా రాబట్టినట్టు తెలుస్తోంది.

Vettaiyan Day 2 Expected Box Office Collections Worldwide Rajinikanth Vettaiyan movie collections drop

ఇక రెండవ రోజు వేట్టయాన్ కలెక్షన్ల అంచన వివరాలను పరిశీలిస్తే.. తొలి రోజు యావరేజ్ టాక్ రావడంతో దీని ప్రభావం కలెక్షన్ల మీద పడే అవకాశముంది. వేట్టైయాన్‌కు భారీ కలెక్షన్లు అందించే తమిళనాడుతో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ పడిపోయాయి. నేడు యుధ పూజ సెలవు ఉన్నప్పటికీ అడ్వాన్స్ బుకింగ్‌లో డ్రాప్ నమోదైంది.శుక్రవారం (ఈ రోజు) ఫస్ట్ షో ప్రారంభం కాకముందే.. ఈ మూవీ2వ రోజు గ్రాస్ రూ. 9.10 కోట్ల టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. నిన్నటి 11.60 కోట్ల గ్రాస్‌తో పోలిస్తే దాదాపు 21.55% కలెక్షన్లు తగ్గినట్టు తెలుస్తోంది.

రజనీ మేనియా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద వర్కటవుట్ అయ్యే అవకాశముంది. అడ్వాన్స్ బుకింగ్స్ లేకున్నా.. నేడు సెలవు , కాస్తా పాజివిట్ వస్తే చాలు.. ఆన్-స్పాట్ బుకింగ్స్ ద్వారా కలెక్షన్లు పెరిగే అవకాశముంది. ఇదిలా ఉంటే.. Book My Show లో టిక్కెట్ విక్రయాల ప్రకారం చూస్తే.. ఉదయం 9 గంటల వరకు వేట్టైయాన్ ఇండియ వైడ్ గా 14.02K టిక్కెట్లను విక్రయించినట్టు సమాచారం.ఇప్పటి వరకూ సక్‌నిల్క్‌ నివేదిక ప్రకారం. వేట్టయాన్ రెండవ రోజు ఇండియా వైడ్ గా 5.86 కోట్ల కలెక్షన్లు సంపాదించింది. ఈ మొత్తం షోలను బట్టి మారుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X