Vettaiyan Day 3 Collection: రికార్డు మార్క్ చేరువలో రజనీ మూవీ.. 3వ రోజు వేట్టయాన్ కు ఎన్ని కోట్లంటే?

Vettaiyan Day 3 Collection: సూపర్ స్టార్ రజనీకాంత్- డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ కాంబోలో తెరకెక్కించిన మూవీ 'వేట్టయాన్'(Vettaiyan) అక్టోబర్ 10న భారీ అంచనాలతో విడుదలైంది. ఈ యాక్షన్ డ్రామాలో రజనీకాంత్ హీరోలో నటించగా.. బాలీవుడ్ బీ బిగ్ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ తదితరులు లీడ్ రోల్ లో కనిపించారు. పాన్ ఇండియా రేంజ్ లో రూపుదిద్దికున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. వేట్టయాన్ మూవీ మూడవ రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఓ లూక్కేయండి.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 170వ సినిమా వేట్టయాన్ ది హంటర్ (Vettaiyan) దసరా కానుకగా ప్రేక్షకులకు వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లి రాజా ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషాల్లో విడుదల అయ్యింది. ఈ యాక్షన్ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్కీన్ షేర్ చేశారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్ర అందించిన సంగీతం మరో లెవల్. బీజీఎం వేరే లెవల్ ఉంది. రజనీకాంత్ జైలర్ (Jailer) మూవీతో పోల్చితే.. ఈ మూవీకి సరైన ప్రమోషన్స్ చేయలేదనే చెప్పాలి. సరైన బజ్ కూడా క్రియేట్ కాలేదు. అయితే.. ఈ మూవీ ఫస్ట్ షో నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నా.. కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది.

Vettaiyan Day 3 Box Office Collections Worldwide Rajinikanth Amitabh Bachchan s action-drama Vettaiyan will cross 100 crores mark

ఇక కలెక్షన్ల పరంగా చూస్తే.. వేట్టయాన్ ఫస్ట్ డే కలెక్షన్లు రికార్డు క్రియేట్ చేస్తోందనే చెప్పాలి. ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో విడుదలైన మూవీలో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో రజని మూవీ చేరింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 68.4 కోట్ల(గ్రాస్)వసూలు చేసి..
సెకండ్ ఫ్లేస్ దక్కించకుంది. ఇదే ఏడాది కోలీవుడ్‌లో విడుదలైన విజయ్ 'ది గోట్' అత్యధిక రూ.120 కోట్లు కలెక్షన్లు రాబట్టి టాప్ ఫ్లేస్ లో నిలిచింది.

'వేట్టయాన్'మూవీ తొలి రోజు ( డే 1) వివిధ ప్రాంతాల్లో కలెక్షన్లు చూస్తే.. పాన్ ఇండియా వైడ్ గా రూ. 30 కోట్లు (నెట్) లేదా రూ. 36 కోట్ల (గ్రాస్) కలెక్ట్ చేసింది. ఇందులో తమిళనాడుతో అత్యధికంగా రూ.25.65 కోట్లు వసూళ్లు చేయగా.. ఇక కర్ణాటక రూ. 8 కోట్లు, కేరళ రూ. 4 కోట్లు వసులూ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ వసూలు చేసింది. ఇందులో నిజాంలో రూ. 1.05 కోట్లు, సీడెడ్ లో రూ. 50 లక్షలు, ఆంధ్రలో రూ. 1.15 కోట్లు చేసింది. ఓవరాల్ గా రూ. 5.20 కోట్లు చేసింది. ఇదెలా ఉంటే.. హిందీ ఓపెనింగ్ మాత్రం దారుణంగా పడిపోయాయి. తొలి రోజు కేవలం రూ. 60 లక్షలు కలెక్ట్ చేయడం అందర్నీ షాక్ గురి చేస్తుంది. ఇక ఓవర్సీస్ లో రూ. 32.40కోట్లు వసూళు చేసినట్టు సమాచారం. ఇలా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు వేట్టియాన్ రూ. 68.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

Vettaiyan Day 3 Box Office Collections Worldwide Rajinikanth Amitabh Bachchan s action-drama Vettaiyan will cross 100 crores mark

ఇక వేట్టయాన్ రెండవ రోజు కలెక్షన్లు పరిశీలిస్తే.. తొలి రోజు యావరేజ్ టాక్ సొంతం చేసుకోవడంతో రెండవ రోజు కలెక్షన్ల పై ప్రభావం పడింది. వేట్టైయాన్‌ కలెక్షన్లకు ఫిల్లర్ లాంటి తమిళనాడుతో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త పడిపోయాయి. ఇక తమిళనాడులో రూ 13.31 కోట్లు వసూలు చేయగా..కర్ణాటకలో రూ. 2.5 కోట్లు , కేరళలో రూ. 2.25 కోట్లు, తెలంగాణలో రూ. 0.99 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో రూ. 0.91 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవరల్ ఇండియా వైడ్ గా రూ.20.49 కోట్లు (నెట్) కలెక్ట్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రెండవ రోజు వేట్టయాన్ దాదాపు 36 కోట్లు (గ్రాస్)వసూలు చేసింది.

రజనీ కాంత్ వేట్టయాన్ మూడవ రోజు కలెక్షన్ల పరంగా చూస్తే.. తమిళనాడులో రూ. 36.5 కోట్లు (గ్రాస్), తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్లు , కేరళలో రూ. 7.1 కోట్లు, హిందీ బెల్ట్ లో రూ. 0.4 కోట్లు, ఓవరాల్ గా పాన్ ఇండియా వైడ్ గా దాదాపు రూ. 25-30 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుందని బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఇండియాలోనే మొదటి రెండు రోజుల్లో ఈ సినిమా 60 కోట్ల నుండి 65 కోట్ల వరకు వసూలు చేసిందని అంటున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 90 కోట్ల నుండి రూ. 95 కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం. వీకెండ్ రోజైన ఆదివారం కూడా హంటర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.మరి అధికారికంగా బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి చిత్ర బృందం ఇంకా ఏమీ ప్రకటించలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X