Vettaiyan Day 4 Collection: 200 కోట్ల వేట్టయాన్.. రజనీ మూవీకి 4వ రోజు ఎన్ని కోట్లంటే?
Vettaiyan Day 4 Collections: సూపర్ స్టార్ రజనీకాంత్- బాలీవుడ్ బీ బిగ్ అమితాబ్ బచ్చన్ లో కాంబోలో తెరకెక్కిన మూవీ 'వేట్టయాన్' (Vettaiyan) అక్టోబర్ 10న భారీ అంచనాలతో విడుదలైంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ డ్రామాలో రజనీకాంత్ హీరోలో నటించగా.. బాలీవుడ్ బీ బిగ్ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ తదితరులు లీడ్ రోల్ లో కనిపించారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. వేట్టయాన్ మూవీ నాలుగవ రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఓ లూక్కేయండి.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లి రాజా నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం ల్లో విడుదలైంది. రజినీకాంత్ 170వ సినిమా వేట్టయాన్ ది హంటర్ (Vettaiyan)లో దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లు కలిసి నటించారు. ఈ యాక్షన్ మూవీ స్టార్స్ రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులతో సహా మొత్తం బడ్జెట్ 300 కోట్లు వరకు వెచ్చించారు. ఇక వేట్టయాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది.

కలెక్షన్ల పరంగా చూస్తే.. వేట్టయాన్ ఫస్ట్ డే కలెక్షన్లలతో పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో విడుదలైన మూవీలో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో విజయ్ 'ది గోట్' అత్యధిక రూ.120 కోట్లు కలెక్షన్లు రాబట్టి టాప్ ఫ్లేస్ లో నిలువగా.. 'వేట్టయాన్'మూవీ తొలి రోజు పాన్ ఇండియా వైడ్ గా రూ.30 కోట్లు (నెట్) లేదా రూ. 36 కోట్లు (గ్రాస్), ఇక ఓవర్సీస్ లో రూ. 32.40కోట్లు వసూళు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు వేట్టియాన్ రూ. 68.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రెండవ స్థానంలో నిలిచింది.
రెండవ రోజు ఫిగర్ 36 కోట్లకు పడిపోయింది. అందులో తమిళంలో 21.45 కోట్లు, తెలుగులో 2.1 కోట్లు, హిందీలో 0.4 కోట్లు, కన్నడలో 0.05 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు ఈ సినిమా రూ.26.75 కోట్లు రాబట్టగా అందులో తమిళంలో రూ.23.4 కోట్లు, తెలుగులో రూ.2.65 కోట్లు, హిందీలో రూ.0.65 కోట్లు, కన్నడలో రూ.0.05 కోట్లు రాబట్టింది. ఇక వేట్టయాన్ మూడవ రోజు కలెక్షన్ల పరిశీలిస్తే.. దేశవ్యాప్తంగా.. రూ.26.75 కోట్లు రాబట్టగా అందులో తమిళంలో రూ.23.4 కోట్లు, తెలుగులో రూ.2.65 కోట్లు, హిందీలో రూ.0.65 కోట్లు, కన్నడలో రూ.0.05 కోట్లు వరకు వసూలు చేస్తుందని బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి.

రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ నటించిన వేట్టయాన్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇక నాలుగవ రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. వేట్టయాన్ నాల్గవ రోజున రూ. 22.25 కోట్లు సంపాదించింది. ఇండియాలో ఇలా మొదటి వారాంతంలో రూ.104.8 కోట్లకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కలెక్షన్లు 200 కోట్లకు చేరుకున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











