Vettaiyan Day 4 Collection: బాక్సాఫీస్ వద్ద రజనీ మూవీ రచ్చ.. 4 వ రోజు వేట్టయాన్ కు ఎన్ని కోట్లంటే?
Vettaiyan Day 4 Expected Collections: సూపర్ స్టార్ రజనీకాంత్- డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ కాంబోలో తెరకెక్కించిన మూవీ 'వేట్టయాన్'(Vettaiyan) అక్టోబర్ 10న భారీ అంచనాలతో విడుదలైంది. ఈ యాక్షన్ డ్రామాలో రజనీకాంత్ హీరోలో నటించగా.. బాలీవుడ్ బీ బిగ్ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ తదితరులు లీడ్ రోల్ లో కనిపించారు. పాన్ ఇండియా రేంజ్ లో రూపుదిద్దికున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. వేట్టయాన్ మూవీ నాలుగవ రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేయబోతుందో అంచనా కలెక్షన్లపై ఓ లూక్కేయండి.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లి రాజా ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషాల్లో విడుదల అయ్యింది. రజినీకాంత్ 170వ సినిమా వేట్టయాన్ ది హంటర్ (Vettaiyan)లో దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. అలాగే.. ఈ మూవీలో ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం ల్లో విడుదలైంది.

ఈ యాక్షన్ మూవీ స్టార్స్ రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులతో సహా మొత్తం బడ్జెట్ 300 కోట్లు వరకు వెచ్చించారు. ఇక వేట్టయాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది. ఇక కలెక్షన్ల పరంగా చూస్తే.. వేట్టయాన్ ఫస్ట్ డే కలెక్షన్లలతో పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో విడుదలైన మూవీలో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో విజయ్ 'ది గోట్' అత్యధిక రూ.120 కోట్లు కలెక్షన్లు రాబట్టి టాప్ ఫ్లేస్ లో నిలువగా.. రజని మూవీ వేట్టయాన్ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 68.4 కోట్ల(గ్రాస్)వసూలు చేసి.. సెకండ్ ఫ్లేస్ దక్కించకుంది.
'వేట్టయాన్'మూవీ తొలి రోజు ( డే 1) వివిధ ప్రాంతాల్లో కలెక్షన్లు చూస్తే.. పాన్ ఇండియా వైడ్ గా రూ. 30 కోట్లు (నెట్) లేదా రూ. 36 కోట్ల (గ్రాస్) కలెక్ట్ చేయగా.. హిందీ ఓపెనింగ్ మాత్రం దారుణంగా పడిపోయాయి. తొలి రోజు కేవలం రూ. 60 లక్షలు కలెక్ట్ చేయడం అందర్నీ షాక్ గురి చేస్తుంది. ఇక ఓవర్సీస్ లో రూ. 32.40కోట్లు వసూళు చేసినట్టు సమాచారం. ఇలా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు వేట్టియాన్ రూ. 68.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఇక వేట్టయాన్ రెండవ రోజు కలెక్షన్లు పరిశీలిస్తే.. తొలి రోజు మిక్స్డ్ టాక్ వారంతో రెండవ రోజు కలెక్షన్ల పై ప్రభావం పడింది. వేట్టైయాన్ కలెక్షన్లకు ఫిల్లర్ లాంటి తమిళనాడుతో కూడా కలెక్షన్లు పడిపోయాయి. తమిళనాడులో రూ 13.31 కోట్లు వసూలు చేయగా..కర్ణాటకలో రూ. 2.5 కోట్లు , కేరళలో రూ. 2.25 కోట్లు, తెలంగాణలో రూ. 0.99 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో రూ. 0.91 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవరల్ ఇండియా వైడ్ గా రూ.20.49 కోట్లు (నెట్) కలెక్ట్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రెండవ రోజు వేట్టయాన్ దాదాపు 36 కోట్లు (గ్రాస్)వసూలు చేసింది.

రజనీ కాంత్ వేట్టయాన్ మూడవ రోజు కలెక్షన్ల పరంగా చూస్తే.. తమిళనాడులో రూ. 59.40 కోట్లు (గ్రాస్), తెలుగు రాష్ట్రాల్లో రూ. 6. 20 కోట్లు ( రూ. 11.7 కోట్లు గ్రాస్), కర్ణాటకలో 15.10 కోట్లు( గ్రాస్) కేరళలో రూ. 7.1 కోట్లు(నెట్), హిందీ బెల్ట్ లో రూ. 0.4 కోట్లు, ఓవరాల్ గా పాన్ ఇండియా వైడ్ గా దాదాపు రూ. 25-30 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుందని బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి.
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ నటించిన వేట్టయాన్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక నాలుగవ రోజు వేట్టయాన్ కలెక్షన్ల అంచనాకు వస్తే.. మధ్యాహ్నం 3:50 గంటల వరకు రూ.9.44 కోట్లకు చేరుకుంది. అంచనా ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకూ మొత్తం వసూళ్లు 91.98 కోట్లకు (నెట్) చేరాయి. రెండు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన ఈ సినిమా 4 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటబోతోంది. అధికారికంగా బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి చిత్ర బృందం ఇంకా ఏమీ ప్రకటించలేదు.


Click it and Unblock the Notifications











