Vettaiyan Day 5 Collection: రజనీ బాక్సాఫీస్ ఎదురీత..5వ రోజు వేట్టయాన్ కు ఎన్ని కోట్లంటే?

Vettaiyan Day 5 Collections: సూపర్ స్టార్ రజనీకాంత్- డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'వేట్టయాన్'(Vettaiyan). ఈ మూవీ అక్టోబర్ 10న భారీ అంచనాలతో విడుదలైన విషయం తెలిసిందే. ఈ యాక్షన్ డ్రామాలో రజనీకాంత్ హీరోలో నటించగా.. బాలీవుడ్ బీ బిగ్ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ భారీ బడ్జెట్ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా.. కలెక్షన్ల పరంగా చూస్తే.. కాస్త బెటరే అనిపిస్తోంది. ఈ క్రమంలో వేట్టయాన్ మూవీ ఐదోవ రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఓ లూక్కేయండి.

సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లు మూడున్నర దశాబ్ధాల తర్వాత ఈ భారీ బడ్జెట్ మూవీలో కలిసిన నటించారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లి రాజా నిర్మించారు. ఈ యాక్షన్ మూవీ స్టార్స్ రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులతో సహా మొత్తం బడ్జెట్ 300 కోట్లు వరకు వెచ్చించారు. వాస్తవానికి ఈ మూవీకి ప్రేక్షకులు, విమర్శకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు రజనీకాంత్ నటన, సాంకేతిక అంశాలను ప్రశంసించగా, చాలా మంది దాని కథాంశం, స్లో స్క్రీన్‌ప్లేను విమర్శించారు.

Vettaiyan Day 5 Box Office Collections Worldwide movie sees massive drop on first monday

ఇక కలెక్షన్ల పరంగా చూస్తే.. వేట్టయాన్ ఫస్ట్ డే కలెక్షన్లు బాక్సాఫీసును షేక్ చేశాయి. ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో విడుదలైన మూవీలో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో విజయ్ 'ది గోట్' రూ.120 కోట్లు కలెక్షన్లు రాబట్టి .. తొలి స్థానంలో నిలువగా.. 'వేట్టయాన్'మూవీ తొలి రోజు పాన్ ఇండియా వైడ్ గా రూ.30 కోట్లు (నెట్) లేదా రూ. 36 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేయగా.. ఓవర్సీస్ లో రూ.32. 40కోట్లు వసూళు చేసింది. ఇలా వేట్టియాన్ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ. 68.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రెండవ స్థానంలో నిలిచింది.

రెండవ రోజు ఫిగర్ 36 కోట్లకు పడిపోయింది. ఇక మూడో రోజు రూ.26.75 కోట్లు రాబట్టి కాస్త బెటర్ అనిపించింది. ఇక నాలుగవ రోజు రూ. 22.25 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలోనే రెండు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన ఈ సినిమా 4 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది. ఇలా మొదటి వారాంతంలో వెట్టయాన్ మూవీ కలెక్షన్స్ రూ.104.75 కోట్లకు చేరుకోగా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ కలెక్షన్ల సంఖ్య రూ. 200 కోట్లకు చేరువైంది.

Vettaiyan Day 5 Box Office Collections Worldwide movie sees massive drop on first monday

ఇదిలా ఉంటే.. మొదటి సోమవారం నాడు మాత్రం రజనీ వేట్టయాన్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. Sacknilk అంచనాల ప్రకారం.. రజనీకాంత్ వేట్టాయన్ 5వ రోజు వసూలు ఘోరంగా పడిపోయాయి. దాదాపు 70% వసూళ్లు క్షీణించాయి. దీంతో ఐదవ రోజు ఇండియా వైడ్ గా
కేవలం రూ.5.50 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో చూస్తే.. రూ. 8 నుంచి 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో 'వేట్టయాన్' 5 రోజుల పాన్ ఇండియా కలెక్షన్లు 109 నుండి 110 కోట్ల (నికరం) లేదా 130 నుండి 131 కోట్ల (గ్రాస్) చేరుకున్నట్టు తెలుస్తోంది.

ఈ పరిస్థితి చూస్తే.. 'జైలర్‌' రికార్డును ' వెట్టయన్‌ ' బద్దలు కొట్టడం కష్టమేనని చెప్పుతున్నారు. 2023లో విడుదలైన 'జైలర్' ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా రాబట్టింది. రజనీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. కానీ, టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన 'వేటయాన్' జైలర్ రికార్డును బద్దలు చేయడం కష్టమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X